జగన్ ఎప్పుడైనా జైలుకు పోవొచ్చు?, కెసిఆర్‌తో క్విడ్‌ప్రోకో బంధం: బొజ్జల
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డిలపై టిడిపి మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టిడిపి సీనియర్ నేత వర్ల రామయ్య వేర్వేరుగా మాట్లాడుతూ మండిపడ్డారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. పట్టిసీమ అవసరం లేదని చెప్పే జగన్మోహన్‌రెడ్డి సెక్షన్ 8 కూడా అవసరం లేదని వాదిస్తున్నాడని ధ్వజమెత్తారు.
తన పార్టీలో పెద్ద వయసున్న వాళ్ల పట్ల కూడా అగౌరవంగా మాట్లాడే జగన్.. ఎప్పుడైనా జైలుకు పోవచ్చన్నారు. తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వ ధోరణి తాగే నీటిని ఎంగిలి చేసిన తోడేలులాగా ఉందన్నారు. కెసిఆర్, జగన్మోహన్ రెడ్డి మధ్య క్విడ్‌ప్రోకో సంబంధం కొనసాగుతోందని అన్నారు.
అందుకే గోదావరి నుంచి సముద్రంలోకి వృథాగా పోతున్న నీళ్లతో రాయలసీమ గొంతు తడపాలని ఏపి సిఎం చంద్రబాబు చూస్తుంటే.. ఒర్వలేక కెసిఆర్, జగన్ ఏడుస్తున్నారని టిడిపి సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. నీళ్లకు, పన్నులకు, భూములకు ఇలా ప్రతీదానికి ఏపితో కాలు దువ్వుతున్న కేసీఆర్‌తో జగన్ ఎందుకు పొత్తు కోరుకుంటున్నారో ప్రజలకు సంజాయిషి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జగన్, విజయసాయిరెడ్డిలను జైలుకు పంపాలి
విజయవాడ: జగన్, విజయసాయిరెడ్డిల బెయిలు రద్దు చేయించి వారిని జైలుకు పంపేలా సిబిఐ చర్యలు చేపట్టాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఆయన విజయవాడలో మాట్లాడారు.
సిబిఐ తమకు లభించిన పెన్‌డ్రైవ్‌ను పరిశీలించి అందులో దాల్మియా అధికారి జయదీప్ బసుకు విజయసాయి పంపిన మెయిల్ డీకోడ్ చేసిన సందర్భంలో 2010 డిసెంబరు వరకు రావలసిన 3500 టన్నుల స్టాక్ చేరిందని, 2011 జనవరికి పంపవలసిన 500 టన్నులు పంపమని ఉన్నట్లు కనుగొన్నారని చెప్పారు. విజయసాయిరెడ్డి భాషలో టన్ను అంటే రూ. కోటి ఆయన తెలియజేశారని వర్ల ఆరోపించారు.












Click it and Unblock the Notifications