వదిలేది లేదు: బొజ్జల, జగన్‌వల్లే రోజా అలా: సుజాత
చిత్తూరు: ఎర్ర చందనం స్మగ్లింగ్ వ్యవహారంలో ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి ఆదివారం చెప్పారు. ఎర్రచందనం చెట్లను నరికేవారిని కూలీలుగా కాకుండా స్మగ్లర్లుగా పరిగణించాలన్నారు.
తమిళ రాజకీయ పార్టీలు ఎన్‌కౌంటర్ ఘటనను రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఇది స్మగ్లర్లకు, పోలీసులకు జరిగిందని, ఎవరు ఎలా చనిపోయిందనేది విచారణలో తేలుతుందన్నారు. రాజకీయం చేయడానికి ఇది సరిహద్దు సమస్యకాదన్నారు.
చంద్రగిరి పోలీసు స్టేషన్‌కు మృతదేహాలు
శేషాచలం అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు జిల్లా చంద్రగిరికి చేరుకున్నారు. తమిళనాడులోని తిరువణ్ణామలై నుండి వచ్చిన వారు కాల్పుల ఘటన పైన చంద్రగిరి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రగిరి పోలీసు స్టేషన్ వద్ద భారీ ఎత్తున పోలీసులను మోహరించారు.

జగన్ ప్రోత్సాహంతో రోజా వ్యాఖ్యలు: సుజాత
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి జగన్ ప్రోత్సాహంతోనే ఎమ్మెల్యే రోజా దళితులపై వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి పీతల సుజాత ఆరోపించారు.
రోజా వ్యాఖ్యలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పట్ల ప్రజలకు భయాందోళనలు కల్గించేందుకు జగన్ బస్సుయాత్ర చేపడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ పూర్తయితే రాయలసీమలో తన పార్టీకి మనుగడ ఉండదని జగన్ భయపడుతున్నారన్నారు.












Click it and Unblock the Notifications