పింఛన్లు అందించిన మంత్రి బొజ్జల (ఫోటోలు)
విజయవాడ: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని జిల్లా కలెక్టర్ సిద్దార్ద్ జైన్ పిలుపునిచ్చారు. మంగళవారం నగరపాలక సంస్ద ఆధ్వర్యంలో స్దానిక పెద్దకాపులేఔట్‌లో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు.
ప్రపంచ ఖ్యాతి గాంచిన తిరుపతిలో నగరపాలక సంస్ద ఆధ్వర్యంలో పారిశుద్ద్యంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండాలన్నారు.
తిరపతి పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమం ద్వారా రూ. 22 కోట్ల పింఛన్లు అందించడం జరుగుతోందని పేర్కొన్నారు.
అనంతరం తేదేపా జిల్లా ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో వృద్దులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు. అంతకముందు ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ, నగరపాలక సంస్ద అధికారులు పాల్గొన్నారు.

పింఛన్లు అందించిన మంత్రి బొజ్జల
జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి పాల్గొని ప్రసంగిస్తున్న దృశ్యం.

పింఛన్లు అందించిన మంత్రి బొజ్జల
జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ పరిసరాలనూ పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని జిల్లా కలెక్టర్ సిద్దార్ద్ జైన్ పిలుపునిచ్చారు.

పింఛన్లు అందించిన మంత్రి బొజ్జల
మంగళవారం నగరపాలక సంస్ద ఆధ్వర్యంలో స్దానిక పెద్దకాపులేఔట్‌లో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు.
పింఛన్లు అందించిన మంత్రి బొజ్జల
మంగళవారం నగరపాలక సంస్ద ఆధ్వర్యంలో స్దానిక పెద్దకాపులేఔట్‌లో నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో వృద్దులకు ఫించన్లు అందిస్తున్న మంత్రి బొజ్జల, కలెక్టర్ సిద్దార్ద్ జైన్.

పింఛన్లు అందించిన మంత్రి బొజ్జల
అనంతరం తేదేపా జిల్లా ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో వృద్దులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు.













Click it and Unblock the Notifications