" 30 శాతం సీట్లివ్వకపోతే పొత్తుకు గుడ్ బై- టీడీపీని ఓడిస్తాం..!"- జనసేన నేత అల్టిమేటం ..!

ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమిలో సీట్ల పంపకాలు కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తున్నా, అంతిమంగా ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉందని అర్థమవుతోంది. ముఖ్యంగా స్ధానిక ఎన్నికల్లో 40 శాతం సీట్లు కేటాయించాలంటూ జనసేన చేస్తున్న డిమాండ్ కు టీడీపీ నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీంతో జనసేన పార్టీకి చెందిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ (Bolisetty Satyanarayana) .. కూటమిని నడుపుతున్న టీడీపీకి 3 గంటల అల్టిమేటం ఇచ్చారు.

TDP రెబెల్స్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్- తప్పుకుంటే ఆఫర్..!
TDP రెబెల్స్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్- తప్పుకుంటే ఆఫర్..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి, పొత్తు ధర్మం ఉంటుందా.. ఊడుతుందా.. అన్నది తెలియడానికి చివరి మూడు గంటల సమయం మాత్రమే ఉందంటూ బొలిశెట్టి సత్యనారాయణ ఇవాళ ట్వీట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల్లోగా 30% ప్రతి నియోజకవర్గంలో జనసేనకు కేటాయించి జనసేన గురించి ప్రాణాలర్పించే జన సైనికులకు వీర మహిళలకు చోటు కల్పిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది లేదంటే తెలుగుదేశం ఓటమి తథ్యం అంటూ బొలిశెట్టి తేల్చిచెప్పేశారు.

Bolisetty Satyanarayana Warns TDP Allocate 30 Seats to Jana Sena Within 3 Hours
 ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!
ఏపీలో నామినేషన్ల పొడిగింపుపై సుప్రీం కీలక ఆదేశాలు-వైసీపీకి ఊరట..!

రాష్ట్రంలో టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకాల మధ్య ఉన్న గ్యాప్ ఏ స్ధాయిలో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. స్థానిక ఎన్నికల్లో 40 సీట్లు ఇవ్వాలని జనసేన పట్టుబడుతున్నా.. చివరికి టీడీపీ చర్చల తర్వాత 30 శాతం అయినా ఇవ్వాలని కోరుతోంది. అయినా టీడీపీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో స్దానిక ఎన్నికల్లో తాము కోరుతున్న 30 శాతం సీట్లు కూడా ఇవ్వకపోతే పొత్తుకు గుడ్ బై చెప్పేస్తామని, అప్పుడు టీడీపీ ఓటమి పాలవ్వడం ఖాయం అంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఇచ్చిన వార్నింగ్ కూటమిలో కలకలం రేపేలా కనిపిస్తోంది. ఈ గడువు దగ్గర పడుతున్నా కూటమి నుంచి ఇతర పార్టీల నేతలు కానీ, జనసేనలోని ఇతర నేతలు కానీ స్పందించలేదు.

స్ధానిక సంస్ధల ఎన్నికలు రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగినవి అని బొలిశెట్టి తెలిపారు. పంచాయతీరాజ్ ఎన్నికలు కానీ, కార్పోరేషన్ల ఎన్నికలు చానీ ముఖ్యమైనవని ఆయన తెలిపారు . 2024 ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తే పటిష్టంగా ఉంటామని భావించి పవన్ కళ్యాణ్ బలవంతంగా ఈ ఏర్పాటు చేసారన్నారు. అదే ఇప్పుడు కొనసాగుతుందని భావించిన వారికి ఇప్పుడు ఆశాభంగం ఎదురైందన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల కల్లా కూటమి పరిస్దితి ఏంటో తేలుతుందన్నారు. టీడీపీ స్ధానిక నేతలకు జనసేనకు 30 శాతం కాదు కదా 10 శాతం కూడా ఇచ్చేందుకు ఇష్టం లేదన్నారు. 30 శాతం అనేది పవన్ కళ్యాణ్ చెప్పిన మాట అని, 30 శాతం లేకపోతే స్నేహపూర్వక పోటీలోకి వెళ్తామని తమ నేత శివశంకర్ నెల్లూరులో చెప్పారన్నారు. విశాఖలో సైతం తాను ఉన్న ఈస్ట్ నియోజకవర్గంలో విశాఖ స్ధానికుడు కాని వ్యక్తికి టికెట్ ఇచ్చి, జనసైనికులకు టికెట్లు ఇవ్వకుండా అడ్డుకున్నారన్నారు. దీన్ని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కానీ సరిచేయకపోతే టీడీపీని ఓడించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+