వైసీపీ కార్యకర్తలపై బాంబులతో దాడి, నిప్పులు చెరిగిన అంబటి
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గురువారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం బాంబు దాడికి పాల్పడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. పాతకక్షలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
కాగా, బాంబు దాడి బాధితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహం సమీపంలో తమ పార్టీ కార్యకర్తల పైన బాంబు దాడికి పాల్పడ్డారని వైసీపీ అంటోంది.

ఈ దాడిలో మాజీ జెడ్పీటీసీ అచ్చిరెడ్డి, రఫీ గాయపడ్డారు. ఓ కేసు విషయమై సత్తెనపల్లి కోర్టులో హాజరై తిరిగి వస్తుండగా వీరి వాహనం పైన దాడి జరిగిందని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు చెబుతున్నారు.
అంబటి రాంబాబు ఆగ్రహం
ప్రశాంతంగా ఉన్న గుంటూరులో బాంబుల సంస్కృతి తీసుకు వస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. గతంలో మంత్రులస్థాయిలో కూడా బాంబుల సంస్తృతి ఉండేదని, ఇప్పుడు మరింత ఎక్కువైందన్నారు. బాంబు దాడిలో తమ నేతలు గాయపడ్డారన్నారు. దాడి చేసిన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
గ్యాస్ సిలిండర్‌పేలి ముగ్గురి పరిస్థితి విషమం
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం, సందరయ్య కట్ట దగ్గర ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు తెలిసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications