వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bombay High Court: జగన్ సర్కార్‌కు బూస్ట్..ఆత్మరక్షణలో టీడీపీ: విద్యావ్యవస్థకు దేవుడే దిక్కు

|
Google Oneindia TeluguNews

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మధ్య తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం చెలరేగడానికి కారణమైంది- పదో తరగతి పరీక్షల నిర్వహణ వ్యవహారం. ఈ పరీక్షలను తాము నిర్వహించి తీరుతామంటూ జగన్ సర్కార్ ప్రకటించింది. దీనిపై తాము వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో కరోనా వైరస్ అంచనాలకు మించిన స్థాయిలో వ్యాప్తి చెందుతోండటాన్ని దృష్టిలో ఉంచుకుని చివరికి రద్దు చేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకుంది. విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తామని తెలిపింది.

కాక పుటిస్తోన్న కేటీఆర్ ట్వీట్: దొంగలముఠా: ఆ తెలివి లేదుగానీ..: బండి సంజయ్ కౌంటర్కాక పుటిస్తోన్న కేటీఆర్ ట్వీట్: దొంగలముఠా: ఆ తెలివి లేదుగానీ..: బండి సంజయ్ కౌంటర్

జగన్ సర్కార్‌పై మినీ వార్..

జగన్ సర్కార్‌పై మినీ వార్..

పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియా వేదికగా ఓ మినీ ఉద్యమాన్నే నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. తరచూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా సంప్రదింపులు జరిపారు. వారి అభిప్రాయాలను సేకరించారు. సీఎం సార్.. నన్ను బతకనివ్వండి.. అంటూ పదో తగరతి విద్యార్థులతో ప్లకార్డులను సైతం పట్టించారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కొన్ని రోజుల పాటు ఈ అంశంపై ప్రభుత్వంతో యుద్ధం చేశారు. అటు భారతీయ జనతా పార్టీ, దాని మిత్రపక్షం జనసేన సైతం పరీక్షల రద్దు కోసం పట్టుబట్టిన విషయం తెలిసిందే. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పలు ప్రకటనలు విడుదల చేశారు. కరోనా సమయంలో టెన్త్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వ మూర్ఖత్వమే అవుతుందంటూ మండిపడ్డారు.

 కరోనా పేరు చెప్పుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా..?

కరోనా పేరు చెప్పుకొని విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా..?

పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో తాజాగా బోంబే హైకోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు.. తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టినట్టయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేయడం ఏ మాత్రం సరికాదని బోంబే హైకోర్టు పేర్కొంది. కరోనా పేరు చెప్పుకొని.. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయడం సరికాదని స్పష్టం చేసింది. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.

దేవుడే కాపాడాలంటూ..

దేవుడే కాపాడాలంటూ..

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌పై విచారణ సందర్భంగా బోంబే హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్‌జే ఖటవల్లా, జస్టిస్ ఎస్పీ తవాడేలతో కూడిన ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.టెన్త్ క్లాస్ వంటి కీలక తరగతికి సంబంధించిన పరీక్షలను నిర్వహించకుండా, విద్యార్థులను ప్రమోట్ చేయడం సరికాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఈ రాష్ట్రం, దేశ విద్యావ్యవస్థను దేవుడే కాపాడాలంటూ జస్టిస్ ఖటవల్లా వ్యాఖ్యానించారు.

జగన్ సర్కార్‌కు బూస్ట్..

జగన్ సర్కార్‌కు బూస్ట్..

ఈ వ్యాఖ్యలు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసినవే అయినప్పటికీ- ఏపీకీ వర్తిస్తాయి. పదో తరగతి పరీక్షలను రద్దు చేయడానికి జగన్ సర్కార్ ఎంతమాత్రం కూడా ఇష్ట పడకపోవడమే దీనికి కారణం. ప్రతి విద్యార్థి భవిష్యత్తును పదో తరగతి పరీక్షలు నిర్ధారిస్తాయని, అలాంటి కీలక క్లాస్‌కు సంబంధించిన పరీక్షలను రద్దు చేయడం సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. టీడీపీ దీన్ని తప్పు పట్టింది. విద్యార్థుల ప్రాణాల కంటే- వారి భవిష్యత్తు ముఖ్యం కాదనే అభిప్రాయాన్ని నారా లోకేష్ సహా పలువురు నాయకులు వ్యక్తం చేశారు. తాజాగా- బోంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. పరోక్షంగా జగన్ సర్కార్ నిర్ణయాన్ని సమర్థించినట్టయింది.

Recommended Video

Long COVID ఓసారి తగ్గాక మళ్లీ ?| 6-12 Months After First Infection మళ్లీ వైరస్ దాడి| Oneindia Telugu

English summary
The Bombay High Court on Thursday came down heavily on the Maharashtra government over the cancellation of the Class 10 exam, saying it was making a mockery of the education system.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X