జగన్ హయాంలో 106 మద్యం బ్రాండ్లు: వాటిని టెస్ట్ చేసే దమ్ముందా: బోండా ఉమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలపై టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 106 మద్యం బ్రాండ్ లు వచ్చాయని బోండా ఉమ విమర్శించారు. జే బ్రాండ్ విష మద్యం సొమ్మంతా తాడేపల్లి నివాసానికి చేరుతుందని బోండా ఉమా ఆరోపణలు గుప్పించారు.
మద్యానికి చెల్లింపులు కాష్రూపంలో తప్పడిజిటల్ రూపంలో ఎందుకు ఉండవు?
విష రసాయనాలు కలిసి ఉన్న మద్యాన్ని తాగి ఎంతోమంది చనిపోతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని బోండా ఉమా జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. జగన్ సర్కార్ కు దమ్ముంటే మద్యం బ్రాండ్లను టెస్ట్ చేయించాలని బోండా ఉమా సవాల్ విసిరారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అమ్ముతున్న మద్యానికి చెల్లింపులు కాష్రూపంలో తప్పడిజిటల్ రూపంలో ఎందుకు ఉండవు? అని ప్రశ్నించిన బోండా ఉమా ఎందుకంటే ఆ డబ్బంతా తప్పుడు లెక్కలరూపంలో తాడేపల్లి ప్యాలెస్కే పోతోందని పేర్కొన్నారు.

అంబటి ఏమైనా మద్యం శాస్త్రవేత్తనా? ప్రశ్నించిన బోండా ఉమా
రాష్ట్రంలో ఇప్పుడున్న బ్రాండ్స్ మంచివేనని మంత్రి అంబటి రాంబాబు చెబుతున్నారని, ఆయనను టార్గెట్ చేసిన బోండా ఉమా బ్రాండ్ లు అన్నీ మంచివే అని చెప్పడానికి ఆయన ఏమైనా మద్యం శాస్త్రవేత్తనా అంటూ బోండా ఉమా ఎగతాళి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం తాగి నిత్యం ఎంతో మంది చనిపోతున్న సంఘటనలు బ్రాండ్ల గొప్పతనాన్ని చెబుతున్నాయని బోండా ఉమ విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న అన్ని మద్యం బ్రాండ్లను టెస్ట్ చేయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? అని బోండా ఉమా ప్రశ్నించారు.

వైసిపి నేతలే డిస్టిలరీలలో నకిలీ మద్యం తయారు చేస్తున్నారు
వైసిపి నేతలే డిస్టిలరీలను తమ చేతుల్లోకి తీసుకుని నకిలీ మద్యం తయారు చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారుతుందని, ఈ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కు వెళుతుందని బోండా ఉమా ఆరోపణలు గుప్పించారు. కల్తీ మద్యం కారణంగా ఎంతో మంది చనిపోతున్నారని, గత కొంతకాలంగా టిడిపి ఆందోళన చేస్తుందని బోండా ఉమా పేర్కొన్నారు. రాష్ట్రంలో జే బ్రాండ్ మద్యంలో విష రసాయనాలు ఉన్నాయని ఆధారాలతో పాటు నిరూపించినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని బోండా ఉమా విచారం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications