బిజెపితో పొత్తు: 'నిజస్వరూపం'పై పార్థసారథికి ఉమ కౌంటర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పార్థసారథికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ సోమవారం నాడు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాము వైసిపిలో కేసుల మాఫీ కోసం బిజెపితో పొత్తు పెట్టుకోలేదని ఎద్దేవా చేశారు.
తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం బిజెపితో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. తమకు ఏపీ అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీతో పొత్తు అన్నారు. తాము పొత్తులో రాజకీయ ప్రయోజనాలు చూడలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొత్తుల వ్యవహారం మాత్రం కేసుల మాఫీ కోసం ఉంటుందని ఎద్దేవా చేశారు.

అంతకుముందు, పార్థసారథి మాట్లాడుతూ... టిడిపి నిజ స్వరూపం బిజెపికి మెల్లిగా అర్థమవుతోందన్నారు. అందుకే ఇప్పటికే తెలంగాణలో ఒంటరిగా ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పిందని, ఏపీలోని ఆ పరిస్థితి వస్తుందని చెప్పారు. దీనిపై బోండా ఉమ స్పందించారు.
వంగవీటి విగ్రహ ధ్వంసంపై చినరాజప్ప ఆగ్రహం
మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరైనా తాము కఠినంగా శిక్షిస్తామని హోంమంత్రి చినరాజప్ప అన్నారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని చినరాజప్ప సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాుర. రంగా విగ్రహాన్ని పునర్ నిర్మిస్తామని చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించేవారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు.












Click it and Unblock the Notifications