తుగ్లక్ పాలనకు తెరదీస్తే సహించేది లేదు: బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

బంగారంపై కూడా కేంద్రం నిబంధనలు విధించబోతున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో.. తుగ్లక్ పాలనకు తెరదీస్తే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ అయ్యారు.

విజయవాడ : కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని ఓవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమర్థిస్తుండగా.. మరోవైపు అదే పార్టీకి చెందిన నేతలు మాత్రం అందుకు విరుద్దంగా వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇప్పటికే ఈ నిర్ణయంలో లొసుగులున్నాయని దుయ్యబట్టగా.. తాజాగా విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు.

నల్లధనం విషయంలో కేంద్రం అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు బోండా ఉమ. బంగారంపై కూడా కేంద్రం నిబంధనలు విధించబోతున్నట్టు తెలుస్తుండడంతో.. ఆ నిర్ణయం గనుక తీసుకుంటే కేంద్రం మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తాత-ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్న బంగారానికి ఎక్కడినుంచి లెక్క చూపాలని ప్రశ్నించారు.

Bonda Uma fires on Central over Gold issue

ఇలాగే కేంద్రం మొండిగా వెళ్తే.. తాము చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పారు. వివాహితల వద్ద 500గ్రాముల బంగారమే ఉండాలన్న అడ్డదిడ్డమైన నిబంధనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అసంత్రుప్తి వ్యక్తం చేశారు. అసలు బంగారమే లేనివాళ్లకు కేంద్రం ఏమైనా ఇస్తుందా అని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని తుగ్లక్ పాలనకు తెరదీస్తే సహించేది లేదని ఫైర్ అయ్యారు.

మొత్తానికి నల్లధనం విషయంలో టీడీపీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సాధారణంగా అధినేత ప్రకటనను విధేయతతో అనుసరించడం చాలా పార్టీల్లో జరిగేదే. ఒకవేళ ఇష్టంలేకపోతే కామెంట్ చేయడం మానేస్తుంటారు. కానీ టీడీపీ నేతలు ఇంకో అడుగు ముందుకేసి విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+