రోజా అంటీ అన్న ఉమ, ఏంట్రా.. బొండా- నాని తిట్ల వర్షం, మా వద్దకొచ్చి బెదిరించారు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బుధవారం శాసన సభ్యులు తిట్ల పురాణం అందుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, రోజాల మధ్య వాగ్వాదం జరిగింది. నేతలు పరస్పరం తీవ్ర తిట్ల వర్షం కురిపించుకున్నారు.

కొడాలి నాని.. బొండా ఉమ పైన రన్నింగ్ కామెంటరీ చేశారు. దీనిపై బొండా ఉమ ఘాటుగా స్పందించారు. ఓ సమయంలో ఏంట్రా అంటే.. ఏంట్రా అంటూ తిట్ల వర్షం కురిపించుకున్నారు. రోజా, కొడాలి నానిలను బోండా ఉమ ఐరన్ లెగ్‌లు అంటూ మండిపడ్డారు. సభలో గందరగోళం చెలరేగటంతో.. స్పీకర్ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు.

బొండా ఉమ మాట్లాడుతూ.. చర్లపల్లి జైలులో చేసినట్లు నిండు సభలో ఇలా చేస్తారా అన్నారు. తాను మాట్లాడే ప్రతి మాటకు విలువుందన్నారు. వైయస్ బతికున్నప్పుడు, విజయమ్మ చెప్పిన మాటలు చెబితే వినే ఓపిక జగన్‌కు, ఆ పార్టీ ఎమ్మెల్యేలకు లేకుండా పోయిందన్నారు.

Bonda Uma lashes out at Kodali Nani and Roja

జగన్, రోజాల పైన చర్యలు తీసుకోవాలన్నారు. అడ్డగోలుగా వారు సభను అడ్డుకుంటున్నారన్నారు. రోజా ఇష్టమొచ్చినట్లు బండబూతులు మాట్లాడుతున్నారని, రోజా ఆంటీ మీద చర్యలు తీసుకోవాలన్నారు. నాని, రోజాలు ఐరన్ లెగ్‌లు అన్నారు. వారు ఎక్కడ ఉంటే అక్కడ సర్వనాశనం అన్నారు.

మమ్మల్ని కొట్టబోయారు.. అందుకే

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నానిలు సభాపతి స్థానం వద్దకు వెళ్లారని, తమ వద్దకు వచ్చి కొట్టే ప్రయత్నం చేశారని సభ వాయిదా పడిన అనంతరం బోండా ఉమ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నాని తమ వద్దకు వచ్చి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. అందుకే అలా మాట్లాడవలసి వచ్చిందన్నారు.

తాము అభ్యంతరకరంగా ఏమైనా మాట్లాడితే వెనక్కి తీసుకుంటామని, కానీ వైసీపీ ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, అభ్యంతరక వ్యాఖ్యలు ఉంటే రికార్డుల నుండి తొలగిస్తామని సభాపతి కోడెల శివప్రసాద్ చెప్పారు. సభాసంప్రదాయాల పైన తమకు గౌరవం ఉందన్నారు. వారు తమ వైపు అవహేళనగా చూస్తున్నారన్నారు. కాగా సభలో ఏంట్రా.. ఏంట్రా రేయ్, అంటూ బోండా ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+