Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రంలో మాపై ఆధారపడే పార్టీ రావాలి: మంత్రి బొత్స

Botcha Satyanarayana: త్వరలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి సారించాయి. మండుటెండలను సైతం లెక్క చేయకుండా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి.

ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ- ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. పలు ప్రశ్నలకు సమాధానాలను ఇచ్చారు. కేంద్రంలో బీజేపీ/ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎలాంటి మేలు జరగలేదనీ పేర్కొన్నారు. పలు అంశాలను ఆయన ఉదహరించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చేసిన వ్యాఖ్యలను బొత్స తప్పు పట్టారు.

Botcha Satyanarayana lashes out at Union Minister Piyush Goel

కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుందని, ఏది పడితే అది మాట్లాడటం, నోటికి వచ్చినట్లు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. కేంద్రమంత్రి హోదాలో మాట్లాడే ప్రతీ మాటకు నిబద్దత ఉంటుందని, దాన్ని నిలబెట్టుకోవాలని హితవు పలికారరు.

ఏపీలో విద్యా మంత్రిత్వ శాఖపై కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని, కేంద్ర మంత్రి కూడా వాటినే వల్లె వేశారని బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు కూడా విద్యాశాఖలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారా?.. అని ప్రశ్నించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని, ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించామని బొత్స గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరిస్తోన్నారని కితాబిచ్చారు. ఉపాధ్యాయులు కష్టపడటం వల్లే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని ప్రశసించారు.

Botcha Satyanarayana lashes out at Union Minister Piyush Goel

2014లో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో పియూష్ గోయెల్ రైల్వే మంత్రిగా పని చేశారని అప్పట్లో ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని ప్రశ్నించారు బొత్స. రైల్వే జోన్ కోసం 52 ఎకరాల భూమిని తమ ప్రభుత్వం కేటాయించిందని పేర్కొన్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో కేంద్రంలో ఉంది సింగిల్‌ ఇంజిన్‌ ప్రభుత్వమా, డబుల్ ఇంజిన్ ప్రభుత్వమా? అని నిలదీశారు.

ఎలక్టోరల్ బాండ్స్‌ రూపంలో దేశంలోనే అతి పెద్ద అవినీతి జరిగింది బీజేపీ హయాంలోనేనని బొత్స అన్నారు. స్సీ, ఎస్టీ రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికగా జరిగే కేటాయింపు, దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ మట్టి కొట్టుకుపోతుందని బొత్స తేల్చి చెప్పారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్రానికి మంచి జరుగుతుందని అంటే ఎలాంటి అంశానికైనా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

అందుకే- కేంద్రంలో తమ వైఎస్ఆర్సీపీపై ఆధారపడే పార్టీ రావాలని కోరుకుంటున్నామని బొత్స అన్నారు. అలా వస్తే రాష్ట్రానికి రావాల్సిన ఇంకా కొన్ని ప్రయోజనాల కోసం కేంద్రాన్ని అడిగి తీసుకోవచ్చని అన్నారు. ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదని చెప్పారు. కేంద్రం అన్నీ రాజకీయ కోణంలో ఆలోచిస్తుందని, అందుకే వైసీపీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+