హైదరాబాద్‌లో మరో 8ఏళ్లు, రాజధాని పేరుతో..: బాబుపై బొత్స తీవ్ర ఆరోపణలు
విజయవాడ: తాత్కాలిక రాజధాని పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ మంగళవారం నాడు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాదులో ఉండేందుకు మరో ఎనిమిదేళ్లు అవకాశముందని చెప్పారు.
హైదరాబాద్ ఇప్పుడు ఉమ్మడి రాజధాని అని చెప్పారు. మరో ఎనిమిదేళ్లు ఉండగా ఇప్పుడు తాత్కాలిక రాజధాని అంటూ నిర్మాణాలు ఎందుకని ప్రశ్నించారు. తాత్కాలిక నిర్మాణాలు అనవసరమని అభిప్రాయపడ్డారు. అధికారం ఇచ్చారని చంద్రబాబు దోచుకోవడం సరికాదన్నారు.

మొన్న భూమిపూజ.. ఇప్పుడు తాత్కాలికం పేరుతో: రఘువీరా
మొన్న భూమిపూజ పేరుతో, నేడు తాత్కాలిక రాజధాని పేరుతో టిడిపి ప్రభుత్వం హడావుడి చేస్తోందని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మండిపడ్డారు. కేంద్రం నుంచి కరువు సాయం పొందడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రంమే రాజధానిని నిర్మించాలని, కానీ ఇప్పటి వరకు రాష్ట్రం ఒక్క రూపాయి తేలేదన్నారు. 19వ తేదీన ఏపీసీసీ కార్యాలయం విజయవాడలో ప్రారంభిస్తామన్నారు.












Click it and Unblock the Notifications