వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో చంద్రబాబు భేటీపై కస్సుమన్న బొత్స, రోజా

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ చిత్తూరు: ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి భేటీపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, రోజా వేర్వేరుగా విమర్శలు చేశారు.

మోడీతో భేటీలో చంద్రబాబు ఏ అంశాలపై చర్చించారో ప్రజలకు వెల్లడించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. 20 అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు అన్నారని, గతంలో ప్రధానితో చెప్పిన విషయాలనే మళ్లీ చెబుతున్నారని ఆయన అన్నారు.

చంద్రబాబు తీరు పాడిందే పాట

చంద్రబాబు తీరు పాడిందే పాట

చంద్రబాబు తీరు పాడిందే పాట అన్నట్లుగా ఉందని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల గురించి ఏమైనా ప్రధాని హామ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. విభజన చట్టంలోని ఏ ఒక్క అంశానకి కూడా హామీ తెచ్చినట్లు చంద్రబాబు చెప్పలేకపోతున్నారని అన్నారు.

లక్షా 20 వేల కోట్ల అప్పులు తెచ్చి...

లక్షా 20 వేల కోట్ల అప్పులు తెచ్చి...

చంద్రబాబు నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏం సాధించి తెచ్చారో చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. లక్షా 20వేల కోట్ల అప్పులు తీసుకుని వచ్ిచ రూ. 16 వేల కోట్లు మాత్రమే నీటి పారుదల మీద ఖర్చు పెట్టారని ఆయన అన్నారు. మిగిలిన నిధులకు లెక్కలు చూపించడం లేదని ఆయన అన్నారు.

 చంద్రబాబు హోదాను తాకట్ట పెట్టారు..

చంద్రబాబు హోదాను తాకట్ట పెట్టారు..

తన స్వలాభం కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని బొత్స ఆరోపించారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణం విభజన చట్టంలో ఉందని, ఒక వేళ పోర్టు ఇవ్వపోతే రెండు ఎకనమిక్ జోన్స్ ఇవ్వాలని అడుగుతున్నారని, పోర్టతో పాటు ఎకనమిక్ జోన్స్ అిగితే బాగుంటుందని ఆయన అన్నారు.

అలా అనడం దారుణం

అలా అనడం దారుణం

పోర్టు ఇవ్వకపోయినా ఫరవా లేదని చంద్రబాబు అనడం దారుణమని బొత్స అన్నారు. దుగరాజుపట్నం పోర్టును ఎందుకు తాకట్టు పెడుతున్నారని ఆయన అడిగారు ప్రత్యేక హోదా కోరి ప్యాకేజీ కావాలని చంద్రబాబు అన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ కింద కూడా ఏమీ రాలేదని అంటున్నారని, చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారన ఆయన అన్నారు.

అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చింది...

అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చింది...

ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటుంటే చంద్రబాబుకు మాత్రం అసెంబ్లీ సీట్లు కావాల్సి వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నరేంద్ర మోడీ, చంద్రబాబులతో ఎపికి ఏ విధమైన ప్రయోజనం లేదని ఆమె అన్నారు.

 కేసుల నుంచి తప్పించుకోవడానికి...

కేసుల నుంచి తప్పించుకోవడానికి...

తన కేసుల నుంచి తప్పించుకోవడానికి, అసెంబ్లీ సీట్లు పెంచుకోవడానికి మాత్రమే చంద్రబాబు ప్రాధాన్యమిచ్చారని రోజా అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబుకు అసెంబ్లీ సీట్ల పెంపు ఒక్కటే సమస్యగా కనిపిస్తోందన అన్నారు.

 ఏది ముఖ్యమని ప్రశ్న

ఏది ముఖ్యమని ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ముఖ్యమా, అసెంబ్లీ సీట్ల పెంపు ముఖ్యమా అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. ప్రధానితో భేటీ సందర్భంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలని కోరినట్లు చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే.

English summary
The YSR Congress party leaders Botsa Satyanarayana and Roja made comments on the meeting between Andhra Pradesh CM Nara Chandrababu Naidu and PM Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X