Botsa Satyanarayana: బ్రెయిన్ స్ట్రోక్ వార్తలపై స్పందించిన బొత్స..!
ఏపీలో విపక్ష వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ప్రస్తుత శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) నిన్న ఉన్నట్లుండి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అందుకే హుటాహుటిన హైదరాబాద్ కు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారని ఇవాళ ప్రచారం జరిగింది. దీనిపై స్వయంగా ఆయనే ఆస్పత్రి నుంచి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన అనారోగ్యంపై అభిమానుల్లో నెలకున్న ఆందోళనకు చెక్ పడింది.
తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఇవాళ హైదరాబాద్ నుంచి బొత్స సత్యనారాయణ ఓ ప్రకటన చేశారు. రొటీన్ చెకప్‌లో భాగంగానే ఆస్పత్రికి వెళ్లినట్లు ఆయన వెల్లడించారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు. దీంతో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్లు జరుగుతున్న ప్రచారం ఒట్టిదేనని తేలిపోయింది. రొటీన్ చెకప్ తర్వాత బొత్స రేపోమాపో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో అధికార కూటమి సభ్యులకూ, వైఎస్సార్సీపీ సభ్యులకు మధ్య వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. అటు అసెంబ్లీకి వైఎస్సార్సీపీ రాకపోవడంతో మండలిలో చర్చలే అసెంబ్లీ తరహాలో వాడీవేడిగా మారాయి. ఇందులో కొద్ది రోజులుగా పాల్గొంటూ చురుగ్గా వ్యవహరిస్తున్న విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇవాళ హఠాత్తుగా కనిపించకపోవడం, అస్వస్థతతో ఆస్పత్రిపాలయ్యారని తెలియడంతో ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications