అగ్రిగోల్డ్ కాదు బాబుగోల్డ్!, ఢిల్లీ, సింగపూర్ టూర్‌పై తేలుస్తాం: సీబీఐ విచారణకు బొత్స డిమాండ్

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం బొత్స పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

అగ్రిగోల్డ్‌ది 4వేల కోట్ల రూపాయల కుంభకోణమని, ఇందులో వేల కోట్లు కాజేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ని బాబు గోల్డ్‌గా మార్చారంటూ ఎద్దేవా చేశారు. దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

కుటుంబరావు.. టీడీపీ అధికార ప్రతినిధా?

కుటుంబరావు.. టీడీపీ అధికార ప్రతినిధా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తున్న కుటుంబరావుకు అగ్రిగోల్డ్‌తో ఏ సంబంధం ఉందని, ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడా? లేక టీడీపీ అధికార ప్రతినిధా? అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్న చంద్రబాబు.. అడుగడుగునా మోసం చేశారని బొత్స మండిపడ్డారు. రూ.1100 కోట్లు విడుదల చేసి 16లక్షల కుటుంబాలను ఆదుకోలేరా? అని నిలదీశారు.

అర్ధరాత్రి ఎందుకు కలిశారు?

అర్ధరాత్రి ఎందుకు కలిశారు?

ఇప్పటి వరకు 20లక్షల కుటుంబాల్లో 200 కుటుంబాల పెద్దలు ప్రాణాలు కోల్పోయారని, బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం దోచుకోవాలని చూస్తోందంటూ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు కోర్టులో ఉండగా, ఏప్రిల్ 3న అమర్ సింగ్, సుభాష్ చంద్రలను సీఎం చంద్రబాబు ఎందుకు అర్ధరాత్రి కలిశారని ప్రశ్నించారు.

ఆస్తులను కొట్టేయాలనే బాబు ఆలోచన

ఆస్తులను కొట్టేయాలనే బాబు ఆలోచన

రూ. 1300కోట్లు కేటాయిస్తే 80శాతం బాధితులకు ఊరట లభిస్తుందని చెప్పారు. బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి.. ఇప్పుడు చంద్రబాబు మాట మార్చారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాలనే ఆలోచన కంటే, ఆస్తులు కొట్టేయాలన్న ఆలోచనే టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబులో ఎక్కువగా కనిపిస్తోందని బొత్స ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు వైయస్సార్ కాంగ్రెస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

సింగపూర్, ఢిల్లీ పర్యటనలపై తేలుస్తాం.. సీబీఐకి..

సింగపూర్, ఢిల్లీ పర్యటనలపై తేలుస్తాం.. సీబీఐకి..

సింగపూర్‌కు చంద్రబాబు ఎందుకు వెళ్లారో త్వరలోనే బయటపెడతామని బొత్స చెప్పారు. ముగ్గురు మంత్రులతోపాటు మరో 70మంది అగ్రిగోల్డ్ ఆస్తులు కొన్నారని, వాటితోపాటు చంద్రబాబు ఢిల్లీ రహస్య మంతనాలపై సీబీఐ విచారణ జరపాలని అన్నారు. చంద్రబాబు లాలూచీ, టీడీపీ నేతలు బెదిరించకుంటే ఎస్సేల్ సంస్థ ఎందుకు తప్పుకుంటుందని బొత్స ప్రశ్నించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP Leader Botsa Satyanarayana on Friday takes on at Andhra Pradesh CM Chandrababu Naidu in agrigold case issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి