ప్రేమించడం లేదని బైక్‌తో ఢీకొట్టాడు: అమ్మకానికి పసికందు

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. నెల్లూరులోని హరినాథపురంలో తనను ప్రేమించాలంటూ సునీల్ అనే యువకుడు డీడీఆర్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినిని కొంతకాలంగా వేధిస్తున్నాడు.

అయితే దీనికి ఆ విద్యార్థిని నిరాకరించింది. దాంతో అతగాడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో మంగళవారం ఆ యువకుడు విద్యార్థినిని బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు ఆ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు.

Boy attacks girls with bike in Nellore district

ఇదిలావుంటే, నెల్లూరు జిల్లాలో పసికందు విక్రయం జరిగింది. లక్ష రూపాయలకు పసికందును విక్రయించారు. ఈ ఘటన నాయుడుపేట మండలం కారుమంచు వారికండ్రిగలో జరిగింది.

ఆ విషయం తెలుసుకున్న స్థానిక ఐసీడీఎస్ అధికారులు పసికందును స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సూత్రధారి ప్రేవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లక్ష్మీకాంతమ్మ అని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+