ప్రేమ విఫలమైన కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య: సుహాసిని శవం వెలికితీత

విజయవాడ: ప్రేమ విఫలంకావడంతో కృష్ణానదిలోకి దూకి ఓ యువకుడు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణలంక రణదేవనగర్‌కు చెందిన రమణ ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

చనిపోయేముందు రమణ సోదరుడు రాజుకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. రాజు వచ్చి చూసే సమయానికి అతని కళ్లెదుటే రమణ కృష్ణానదిలోకి దూకేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో కొండపై నుంచి దూకి చనిపోయిన యువతి సుహాసిని మృతదేహాన్ని పోలీసులు ఎట్టకేలకు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే సుహాసినిని ప్రియుడు ప్రశాంత్ తోసి చంపేశాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు.

Boy commits suicide jumping into Krishna river

ఫీజు కట్టలేదని ఎండలో నిలబెట్టారు

నెల్లూరు నగరంలోని మాస్టర్ మైండ్ కాలేజీ యాజమాన్యం ఫీజు కట్టలేదని ఓ విద్యార్థినిని రెండు గంటలపాటు ఎండలో నిలబెట్టింది. విషయం తెలిసిన విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని యాజామాన్యాన్ని ప్రశ్నించారు.

దీంతో కోపోద్రిక్తులైన సిబ్బంది ఏకంగా వారిపైనే దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కళాశాల యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+