బాలుడ్నిచంపి, శవాన్ని మంచం కింద దాచాడు

గుంటూరు/ నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్ల గ్రామంలో శనివారం అపహరణకు గురైన బాలుడు బన్నీని దుండగులు దారుణంగా హత్య చేశారు. వేసవి సెలవుల కోసం తాతగారింటికి వచ్చిన బన్నీని ఇంటికి సమీపంలో ఉండే ఆటో డ్రైవర్‌ కిడ్నాప్‌ చేశాడు.

తర్వాత కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రూ. 15 లక్షల ఇవ్వాలని డిమండ్‌ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్‌ నెంబర్‌ ఆధారం చేసుకుని దర్యాప్తు చేశారు. కిడ్నాపర్‌‌ను వినుకొండ తిరుపతిరావుగా గుర్తించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి ప్రశ్నించడంతో అసలు విషయాన్ని బయటపెట్టాడు.

 Boy kidnapped and killed in guntur district

మృత దేహాన్ని తన ఇంట్లో మంచం కింద ఉంచినట్లు చెప్పాడు. బన్నీ స్వస్థలం నల్గొండ జిల్లా దామరచర్ల మండలం అడవిదేవరపల్లి. డబ్బు ఇవ్వకపోవడంతో బాలుడిని హత్య చేసినట్లుగా తిరుపతిరావు పోలీసుల విచారణలో తెలిపాడు.

కేరళవాసి అనుమానాస్పద మృతి

నెల్లూరు జిల్లాలోని గూడూరు ప్రభుత్వాస్పత్రి దగ్గర వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడిని కేరళకు చెందిన శరత్‌గా గుర్తించారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+