క్షుద్రపూజలకు బాలుడి బలి: స్పృహతప్పి పడిపోయిన తల్లి

ఒంగోలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. నరబలి పేరుతో ఓ బాలుడ్ని నిర్ధాక్షిణ్యంగా గొంతు కోసి హతమార్చారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం మండలం పోకూరులో గ్రామంలో జరిగింది. బాలుడు తల, మొండెం వేరు చేసి రైల్వే ట్రాక్‌పై పడేశారు

ఆ గ్రామానికి చెందిన తిరుమల రావు అనే వ్యక్తి క్షుద్రపూజల కోసం ఓ బాలుడ్ని గొంతుకోసి చంపాడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థులు అతనిపై కిరోసిన్ పోసి నిప్పటించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తిరుమలరావును ఆస్పత్రిలో చేర్చారు.

Boy sacrificed in black magic inPrakasam district

ఎల్. బి. మహేందర్, ఆదిలక్ష్మిల కుమారుడు మనసాగర్ (4)ను అదే గ్రామానికి చెందిన పి. తిరమల రావు తన స్వగృహంలో క్షుద్రపూజలు చేసి బలి ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి. అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటున్న మనుసాగర్ మధ్యాహ్న భోజనానికి ఇంటికి రాకపోవడంతో తల్లి పాఠశాలకు వెళ్లి విచారించింది.

బాలుడ్ని తిరుమలరావు తీసుకుని వెళ్లినట్లు ఉపాధ్యాయులు ఆమెకు చెప్పారు. ఆమె తిరుమలరావు ఇంటికి వెళ్లి చూడగా బాలుడి మెడ తెగి ఉంది. తిరుమలరావుకు ప్రజలు దేహశుద్ధి చేశారు. సంఘటనా స్థలానికి డిఎస్పీ శ్రీనివాస రావు, కందుకూరు సిఐ లక్ష్మణ్ చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి తల్లి స్పృహ తప్పి పడిపోయింది.

ఇదిలావుంటే, తిరుమలలో బ్లాక్‌లో టికెట్లు విక్రయించే ముఠాలు రెచ్చిపోతున్నాయి. బుధవారం బ్లాక్‌లో సుప్రభాతం టికెట్లు విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠా‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుప్రభాతం టికెట్‌ను రూ.5 వేలకు ఇప్పిస్తామని ముఠా సభ్యులు భక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే..సమాచారం తెలుసుకున్న పోలీసులు ముఠాను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+