బోయపాటి శ్రీను, రామ్ కొంప ముంచిన తమన్?

హైవోల్టేజ్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని స్కంధ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. గుమ్మడికాయ కొట్టారో లేదో తెలియదుకానీ ఒక పాట మాత్రం బ్యాలెన్స్ ఉండిపోయింది. ఆ పాట తీస్తే సినిమా మొత్తం పూర్తయినట్లు లెక్క. అయితే ఇలా కావడానికి కారణం సంగీత దర్శకుడు తమన్ అని తెలుస్తోంది.

రామ్ స్కంధ సినిమా కోసం ప్రత్యేక లుక్ లోకి మారాడు. ఈ సినిమా తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. స్కంధ లుక్ నుంచి ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి రామ్ మారిపోయాడు. స్కంధ లుక్ డిఫరెంట్ గా ఉంది. మనిషి కొంచెం లావుగా కనపడటంతోపాటు బోయపాటి శ్రీను ఆలోచనలకు అనుగుణంగా రామ్ ను తీర్చిదిద్దాడు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ లుక్ లోకి మారిపోయిన రామ్ ముందు స్కంధ సినిమాలో పాట బ్యాలెన్స్ మిగిలివుండటం ఇబ్బందికరంగా మారింది.

boyapati srinu and ram movie skandha movie update

చేతినిండా ప్రాజెక్టులతో తమన్ బిజీగా ఉన్నాడు. వచ్చిన ఆఫర్లన్నింటినీ ఒప్పుకోవడంవల్లే స్కంధలో పాట బ్యాలెన్స్ ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నడుస్తోంది. బ్రో సినిమాకు కూడా ఇలాగే చివరలో ఇచ్చాడంట. ఇప్పుడేమో స్కంధకు ఒక పాట బ్యాలెన్స్ చివరలో ఇచ్చాడు. స్కంధ లుక్ నుంచి ఇస్మార్ట్ లుక్ లోకి మారిన రామ్ తిరిగి స్కంధ లుక్ లోకి రావడం చాలా కష్టం. అంతేకాదు.. ఏ లుక్ లో ఈ పాటను చిత్రీకరిస్తారనేది తెలియడంలేదంటున్నారు. బోయపాటి, రామ్ ఏం ఆలోచిస్తున్నారో తెలియడంలేదు. చివరకు ఏం చేస్తారో చూడాలి. పాట షూటింగ్ జరుపుకోవచ్చు.. లేదంటే ఆ పాటను సినిమా నుంచి ఎత్తేస్తారేమో.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+