త్వరలో అరె ఓ సాంబా!! హుకుం సర్దార్ ప్రోగ్రాం: పవన్, 'టీవీ9, టీవీ5, ఏబీఎన్‌లను బహిష్కరించండి'
అమరావతి: మహిళలను కించపరిస్తుందని, అలాగే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన దుష్ప్రచారం చేస్తోందని భావిస్తున్న మీడియాను బహిష్కరించాలని జనసేన ఆదివారం పిలుపునిచ్చింది. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ట్వీట్ చేసింది.
'ఎల్లో మీడియాను బహిష్కరించండి' అని పవన్ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తే ఆ ట్వీట్ చేసింది'మన తల్లులను, బిడ్డలను, సోదరీమణులను దూషిస్తున్న టీవీ 9, టీవీ 5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలను బహిష్కరించండి. నగ్నత్వంతో, అమర్యాదకరంగా వ్యాపారం చేసుకుంటున్నందుకు వాటిని మనం బహిష్కరించాల్సి ఉంది. నిస్సహాయురాలైన సోదరిని ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు' అని ట్వీట్ చేశారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ కూడా వ్యక్తిగత ఖాతా నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. త్వరలోనే సరదాగా, కాలక్షేపం కోసం 'అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం మీ ముందుకు రాబోతుంది. త్వరలోనే సరదాగా, కాలక్షేపం కోసం 'అరె ఓ సాంబ !! హుకుం సర్దార్ !! ప్రోగ్రాం లో సింపుల్ చిట్ చాట్, గాసిప్, ఫొటోస్, వీడియోస్ మొదలైన వాటితో పాటు స్టీమీ అఫైర్స్ కూడా మా సాంబాస్ వరల్డ్‌లో ఉంటాయి' అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications