భారతీయులకు బీపీ పెరుగుతోంది.. డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్!!
ప్రపంచ వ్యాప్తంగా అధిక రక్తపోటు బాధితులు పెరిగిపోతున్నారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా బీపీ బాధితులలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి పదిమందిలో ముగ్గురు హైబీపీతో బాధపడుతున్నారని అంచనా వేసింది.
హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న ప్రతి ఐదుగురిలో దాదాపు నలుగురికి తగిన చికిత్స అందడం లేదని ఫలితంగా అనేకమంది బీపీ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొంది. అధిక రక్తపోటును పట్టించుకోకపోతే గుండెపోటు, ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ, దేశాలు కవరేజ్ ని పెంచగలిగితే ఈ 2023 మరియు 2050 మధ్య 76 మిలియన్ల మరణాలను నివారించవచ్చని తన నివేదికలో వెల్లడించింది.

2016 నుండి 2020 మధ్య కాలంలో భారతదేశంలో అధిక రక్తపోటు కలిగిన రోగులను నాలుగింట ఒక వంతు కంటే తక్కువ, వాళ్ళ రక్తపోటు నియంత్రణలో ఉందని పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్ కింద పెద్ద ఎత్తున హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నప్పటికీ అధిక రక్తపోటు బాధితులు పెరుగుతుండడం భారత దేశంలో ఆందోళన కలిగిస్తుంది.
2019 - 2020 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో పురుషులలో 24 శాతం మందికి, స్త్రీలలో 21 శాతం మందికి రక్తపోటు ఉందని నివేదించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముగ్గురిలో ఒకరిని రక్తపోటు ప్రభావితం చేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక పేర్కొంది. అధిక రక్తపోటు ప్రాణాంతక పరిస్థితికి కారణమయ్యే స్ట్రోక్ కు, మూత్రపిండాలు దెబ్బ తినడానికి, గుండె పోటుకు, ఇతర అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పేర్కొంది.
ఇక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య 1990 నుండి 2019 మధ్య 650 మిలియన్ల నుండి 1.3 బిలియన్లకు రెట్టింపు అయిందని పేర్కొంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పొగ తాగడం మానేయాలని పేర్కొంది. ఉప్పు తగ్గించాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించింది.












Click it and Unblock the Notifications