మండుతున్న ఎండలు, వేడిగాలులతో ఇబ్బందులు: నాలుగైదు రోజుల్లో మరింత ఎక్కువ

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న నాలుగైదు రోజుల్లో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి, ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 43 శాతం కంటే గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 41 శాతం మించి ఉంటాయనితెలిపింది.

ఏప్రిల్ 21 తేదీ నుంచి 22 తేదీ వరకూ ప్రకాశం, ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ఇతర ప్రాంతాల్లోను 42 డిగ్రీల కంటే ఎక్కువ ఉంటుందని తెలిపింది. అప్రమత్తమంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వేడిగాలులతో ప్రజలు ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అమరావతి సహా పలు ప్రాంతాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది.

Brace for heat wave in Andhra Pradesh as temperature set to rise

కాగా, మరోవైపు, ఈ ఏడాది ఖరీఫ్‌లో వానలకు ఢోకా ఉండదని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మే చివరి వారం లేదా జూన్‌ తొలి వారంలో నైరుతి రుతు పవనాలు కేరళను తాకి 45 రోజుల్లో దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని పేర్కొంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Brace for heat wave in Andhra Pradesh as temperature set to rise.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X