అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతి ఎప్పుడు: బాబుకు రోజా, విజయవాడలో ఫెయిలైందని హెచ్చరిక

రాజధాని అమరావతి డిజైన్‌లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: రాజధాని అమరావతి డిజైన్‌లపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో వైసిపి ఎమ్మెల్యే రోజా ఘాటుగా స్పందించారు. ఆమె సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

'బాబుకు నచ్చలేదని రాజమౌళి వద్దకా', జక్కన్న అప్పుడే నో చెప్పారు, ఐనా 'బాబుకు నచ్చలేదని రాజమౌళి వద్దకా', జక్కన్న అప్పుడే నో చెప్పారు, ఐనా

రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది?

రాజధాని ఎప్పుడు పూర్తవుతుంది?

అమరావతి భ్రమరావతే అని ఎద్దేవా చేశారు. పూటకో మాట, రోజుకో మీటింగ్, వారానికో కొత్త డిజైన్, పక్షానికో విదేశీ యాత్ర, నెలకో తాత్కాలిక భవనానికి శంకుస్థాపన అంటూ సెటైర్లు వేశారు. రాజధాని అమరావతి ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించారు.

రోజా పోస్టుపై...

రోజా పోస్టుపై...

రోజా పోస్టులకు పలువురు నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. వచ్చేసారి టిడిపి గెలవదని, వైసిపికి 140 ఎమ్మెల్యే సీట్లు, 26 ఎంపీ సీట్లు రావడం ఖాయమని ఒకరు చెప్పగా, మీరు తొందరపడి బొక్కబోర్లా పడ్డారని మరొకరు వైసిపికి కౌంటర్ ఇచ్చారు.

ప్రతిఘటన తప్పదని హెచ్చరిక

ప్రతిఘటన తప్పదని హెచ్చరిక

తడకులో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ ప్రయత్నాలను విరమించుకోవాలని, చిత్తూరు జిల్లాకు పుత్తూరు ఏమన్నా డంపింగ్ యార్డా అని రోజా ప్రశ్నించారు. ప్లాంట్ నిర్మాణానికి ప్రయత్నిస్తే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఆమె గురువారం తడుకు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు.

విజయవాడలో ఫెయిలైంది

విజయవాడలో ఫెయిలైంది

ఈ సందర్భంగా రోజా మాట్లాడారు. వేస్ట్ ఎనర్జీ అనేది ఒక విఫల ప్రయోగమన్నారు. విజయవాడలో ఈ ప్రయోగం విఫలమైందని చెప్పారు. జిల్లాలో ఉత్పత్తి అయ్యే చెత్తను తడుగు వద్దకు తరలించడం దారుణం అన్నారు. దీని వల్ల పుత్తూరు, వడమాలపేట మండలాల్లో దోమలు, ఈగలు ఉధృతమై ప్రజలు విషజ్వరాల బారిన పడతారన్నారు.

చూస్తూ ఊరుకోను

చూస్తూ ఊరుకోను

ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు తనకు ముఖ్యమని రోజా అన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మూడున్నరేళ్లలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి ఇవ్వని చంద్రబాబు, ఇప్పుడు చెత్తను రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నగరిలో ఈటీపీ ప్లాంట్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకొని ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఎందుకు స్పందించడం లేదన్నారు. నాపై కక్ష సాధింపులో భాగంగా ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

English summary
YSR Congress Party MLA Roja on Friday lashed out at Andhra Pradesh chief minister and TDP chief Nara Chandrababu Naidu for amaravati designs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X