రైల్వే స్టేషన్లో వెనుక నుండి చెయ్యేసి వెకిలి..: చితక్కొట్టిన యువతి
ఖమ్మం: తన మీద చెయ్యి వేసి వెకిలివేషాలు వేసిన ఓ వ్యక్తికి ఓ యువతి అందరి ముందు బుద్ధి చెప్పింది. ఈ సంఘటన గురువారం రాత్రి ఖమ్మం జిల్లాలో జరిగింది. మణుగూరు రైల్వే స్టేషన్‌లో ఓ యువతి రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.
ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమె పైన వెనుక నుండి చేయి వేసి, వెకిలివేషాలు వేసే ప్రయత్నం చేశాడు. అతను అప్పటికే తాగి ఉన్నాడు. దీంతో ఆగ్రహోద్రురాలైన ఆ యువతి అతనిని రైల్వే స్టేషన్‌లో అందరి ముందే చితకబాదింది. అనంతరం పోలీసులకు అప్పగించింది.

చిత్తూరులో కొనసాగుతున్న ఆపరేషన్ 'గజ'
చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలో ఏనుగులను కట్టడి చేసేందుకు అటవీశాఖ అధికారులు చేపట్టిన 'ఆపరేషన్ గజ' కొనసాగుతోంది. శిక్షణ పొందిన రెండు ఏనుగులతో ఆపరేషన్ గజను నిర్వహిస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆముదం నూనె చల్లడం, తేనెటీగల శబ్దం వినిపించడంతో ఏనుగులను అడవిలోకి తరిమేందుకు యత్నిస్తున్నారు.
బంజారాహిల్స్‌లో అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ లభ్యం
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. ఎంబీటీనగర్‌కు చెందిన శ్రవణ్ (11), పవన్(4), దుర్గాప్రసాద్(15) అనే బాలురు విజయవాడలోని భవానీపురంలో దొరికారు. వారు పోలీసుల అదుపులో ఉన్నారు.












Click it and Unblock the Notifications