రాజధాని రైతుల తిప్పలు మామూలుగా లేవుగా.. నేడు అమరావతి రైతుల మహా పాదయాత్రకు బ్రేక్; కారణమిదే!!

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న మహా పాదయాత్ర ఈరోజు 18 వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం టు దేవస్థానం అంటూ అమరావతి ప్రాంత రైతులు ప్రారంభించిన పాదయాత్ర వివిధ జిల్లాలలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని విస్తరించడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి, న్యాయస్థానంలో న్యాయం జరగాలని, దేవస్థానంలో దేవుడికి నివేదించటం ద్వారా ధర్మం గెలవాలని సాగిస్తున్నారు. తుళ్లూరు నుండి తిరుమల తిరుపతికి పాదయాత్ర సాగిస్తున్న అమరావతి రైతు మహా పాదయాత్రకు ఈరోజు బ్రేక్ పడింది.

రాజధాని రైతుల మహా పాదయాత్రలో రైతుల తిప్పలు అన్నీఇన్నీ కావు

రాజధాని రైతుల మహా పాదయాత్రలో రైతుల తిప్పలు అన్నీఇన్నీ కావు

రాజధాని అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్ర తిప్పలు మామూలుగా లేవు. అడుగడుగునా అనేక అవరోధాలను దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక పక్క పోలీసుల ఆంక్షలు, మరో పక్క పాదయాత్రకు అనుకూలించని వాతావరణ పరిస్థితులు వెరసి పాదయాత్ర అనేక ఇబ్బందుల మధ్య కొనసాగుతుంది. అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్రకు టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ, జనసేన, ప్రజా సంఘాలు కూడా మద్దతును ప్రకటిస్తున్నార్యి. ఒక్క వైసీపీ మాత్రమే రాజధాని అమరావతి ఆకాంక్షను వ్యతిరేకిస్తుంది. అలాగే మూడు రాజధానులు కట్టి తీరుతామనితేల్చి చెప్తుంది. ఇక రాజధాని రైతుల మహా పాదయాత్రను టీడీపీ పాదయాత్రగా చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారు వైసిపీ నేతలు.

ప్రకాశం జిల్లాలో 17 వ రోజు పాదయాత్ర సాగిందిలా..

ప్రకాశం జిల్లాలో 17 వ రోజు పాదయాత్ర సాగిందిలా..

అమరావతి రైతు మహా పాదయాత్ర పదిహేడవ రోజైన బుధవారం నాడు ప్రకాశం జిల్లాలో జోరుగా సాగింది. పాదయాత్ర నిర్వహిస్తున్న అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలపడానికి పెద్ద ఎత్తున యువత, రైతులు తరలివచ్చారు. గ్రామాలలో అమరావతి నినాదం మార్మోగింది. సిపిఎం నేత రాఘవులు అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ప్రకటించారు. ఇక గురువారం నాడు అమరావతి రైతుల పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి చేరి, అక్కడ నుండి నిర్వహించాల్సి ఉండగా భారీగా కురుస్తున్న వర్షం రైతుల పాదయాత్రకు అవాంతరంగా మారింది.

 నవంబర్ 18 గురువారం మహా పాదయాత్రకు విరామం, భారీ వర్షాలే కారణం

నవంబర్ 18 గురువారం మహా పాదయాత్రకు విరామం, భారీ వర్షాలే కారణం

దీంతో రాజధాని రైతులు నవంబర్ 18 మహా పాదయాత్రకు విరామం ఇచ్చారు. అల్పపీడనం కారణంగా విపరీతంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుధవారం రాత్రి ప్రకాశం జిల్లా గుడ్లూరులోనే రైతులు బసచేశారు. రాత్రి సరైన వసతులు లేకపోవడంతో అమరావతి రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో, ఆ ఇబ్బందులను తట్టుకుంటూనే రైతులు మహా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం రోజు కూడా భారీ వర్షాలు కురుస్తుండడంతో ఈరోజు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన అమరావతి పరిరక్షణ సమితి నేతలు, రేపు యధావిధిగా పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.

జగన్ మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న మహా పాదయాత్ర

జగన్ మూడు రాజధానుల నిర్ణయం వెనక్కు తీసుకోవాలని, రాజధాని అమరావతి కోసం రైతులు సాగిస్తున్న మహా పాదయాత్ర

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధాని, ఏకైక రాజధానిగా అమరావతి నగరాన్ని మాత్రమే చూడాలని అమరావతి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నా, రాత్రి సమయాల్లో బస చేసే విషయంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నా, పోలీసుల ఆంక్షలతో పాదయాత్రకు ఇబ్బందులు ఎదురవుతున్నా సరే, అడుగడుగునా పోలీసుల నిఘా మధ్య అమరావతి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. పోలీసుల నోటీసులకు, ప్రభుత్వ బెదిరింపులకు భయపడకుండా రైతుల మహాపాదయాత్ర కొనసాగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+