అన్న అడుగేస్తే మాస్‌.. అన్న లుక్కేస్తే మా మా మాస్‌

భార‌తీయ జ‌న‌తాపార్టీకి వ్య‌తిరేకంగా పోరాడ‌టానికి తెలంగాణ రాష్ట్ర స‌మితిని భార‌త్ రాష్ట్ర స‌మితిగా మార్చిన క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు వ‌చ్చేనెల నుంచి పోరుబాట ప‌ట్ట‌నున్నారు. ముందుగా ఆయ‌న తెలంగాణ క‌వ‌ల రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఎంచుకున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి అందిన స‌మాచారం మేర‌కు వ‌చ్చే నెల‌లో ఏపీలో మూడు బ‌హిరంగ‌స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఒక‌టి విజ‌య‌వాడ‌లో, మ‌రొక‌టి తిరుప‌తిలో, ఇంకోటి విశాఖ‌ప‌ట్నంలో జగరనున్నాయి.

 తనపై ప్రజలకు ఎంత కోపం ఉందో కేసీఆర్ కు తెలుసు!

తనపై ప్రజలకు ఎంత కోపం ఉందో కేసీఆర్ కు తెలుసు!


ఏపీలో వైఎస్ జ‌గ‌న్ 2019లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అప్పుడు ఏపీకి వ‌చ్చిన కేసీఆర్ ఆ త‌ర్వాత రాలేదు. ఇప్పుడు భార‌త్ రాష్ట్ర స‌మితి పేరుతో అడుగు పెడుతున్నారు. జాతీయ పార్టీ అధినేత‌గా ఏపీలో స‌భ‌లు నిర్వ‌హించే ఆయ‌న ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌బోతున్నార‌నేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న‌కు ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం నిర్వ‌హించిన త‌న‌పై ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంత కోపం ఉంటుందో ఆయ‌న‌కు తెలియ‌నిదేం కాదు. ఉద్యమ స‌మ‌యంలో సీమాంధ్రులంటూ వారిని దూషించిన విష‌యాన్ని కూడా మ‌ర్చిపోలేదని తెలుసు.

కేసీఆర్ వ్యూహం ఏమిటి?

కేసీఆర్ వ్యూహం ఏమిటి?


ఇటువంటి త‌రుణంలో స‌భ‌లు నిర్వ‌హించ‌బోతున్న కేసీఆర్ వేదిక‌పై ప్ర‌జ‌ల‌కు ఏం చెప్ప‌బోతున్నారు? ఈ విష‌యంలో ఆయ‌న ఎటువంటి వ్యూహాన్ని అవ‌లంబించ‌బోతున్నారు? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య విభ‌జ‌న సంద‌ర్భంగా జ‌రిగిన ఆస్తుల పంపిణీ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన ప్ర‌తి ప‌నిలోను ఏపీకి అన్యాయ‌మే జ‌రిగింది. ఇప్ప‌టికీ ఇరు రాష్ట్రాల మ‌ధ్య ప‌లువురు ఉద్యోగులు ఊగిసలాడుతున్నారు. 2014లో తెలంగాణ వ్య‌తిరేకించిన ఏడు మండ‌లాల‌ను పోల‌వ‌రం ముంపు కింద ఏపీలో క‌లిపేశారు. ఇటువంటివి చాలావున్నాయి.

స్పష్టత రాకుండా ఏం చెప్పినా కంఠశోషే

స్పష్టత రాకుండా ఏం చెప్పినా కంఠశోషే


ఏపీకి కేంద్రంలో అధికారంలో బీజేపీ నుంచి అన్యాయ‌మే జ‌రుగుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో ఉంది. ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచింది. తాజాగా అసెంబ్లీ సీట్లు కాశ్మీర్‌లో పెంచుతున్నారు కానీ ఏపీలో, తెలంగాణలో పెంచ‌డంలేదు. పోల‌వ‌రం, ప్ర‌త్యేక హోదా, రాజ‌ధాని లాంటి అంశాలు ఏపీలో కీల‌కంగా మారాయి. వీటిపై రాష్ట్రంలోని అధికార పార్టీ స్పంద‌న ఏమిటి? జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై కేసీఆర్ ఎటువంటి వ్యాఖ్య‌లు చేస్తారు? ఆయ‌న అభిప్రాయం ఏమిటి?.. తదితరాలపై స్పష్టత ఇవ్వగలిగితేనే ఆంధ్రులు ఒక అభిప్రాయానికి రాగలుగుతున్నారు. అలా కాకుండా ఏం చేసినా, ఏం చెప్పినా కంఠశోషే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+