'రోజా బూతులు చెప్తున్నట్లుగా, నాలుక చీరేస్తారు', 'ఆ పిశాచాల్ని కూర్చోబెట్టండి'

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నీతులు చెబుతుంటే ఏపీ ప్రజలకు బూతులు చెబుతున్నట్లుగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మంగళవారం విమర్శించారు.

చంద్రబాబు వంటి వ్యక్తిని రోజా ఏకవచనంతో సంభోదిస్తున్నారని, ఈ వైఖరి ఎంతమాత్రమూ తగదన్నారు. చంద్రబాబు శ్రీరాముడైతే, రోజా శూర్పణక అన్నారు. రామాయణంలో ఆమె ముక్కూ చెవులను కోశారని, ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు రోజా నాలుకను చీరేస్తారన్నారు.

roja

ఆ పిశాచాలను కూర్చోబెట్టండి

అసెంబ్లీలో టిడిపి నేతలు వైసిపి పైన మండిపడ్డారు. వాయిదా అనంతరం ప్రారంభమైన అసెంబ్లీలో వైసీపీ నేతలు మళ్లీ సమావేశాల్ని అడ్డుకోవడంపై అధికార పార్టీ నేతలు మండిపడ్డారు.

రాష్ట్రం ముందుకెళ్లాలంటే సీఎం చంద్రబాబు పని చేయాలని, ఆయనను పని చేయకుండా అడ్డుకుంటున్న పిశాచాల్ని కూర్చోబెట్టాలని టీడీపీ నేత స్పీకర్‌ను కోరారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రశ్నలడుగుతున్నారని, సమాధానం మాత్రం తనను చెప్పనివ్వటం లేదని మంత్రి రావెల కిషోర్ బాబు విమర్శించారు.

ప్రజా సమస్యలను చర్చించేందుకు వేదిక అయిన అసెంబ్లీని వైసీపీ సభ్యులు తప్పుదోవ పట్టిస్తున్నారని మరో టీడీపీ నేత విమర్శించారు. నియోజకవర్గ సమస్యలు పరిష్కరించుకునే సమయంలో ఇలా వైసీపీ సభ్యులు గొడవ చేయడం బాధాకరమని మరో నేత విమర్శించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader Buddha Venkanna hot comments on YSRCP MLA Roja.
Please Wait while comments are loading...