• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దేవుడి స్క్రిప్ట్ ..ముగ్గురిని కొన్నాం.. వచ్చే ఎన్నికల్లో మూడు సీట్లే : లాఫింగ్ 'బుద్ధా' పంచ్

|

ఏపీ రాజకీయాలు నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టు సాగుతున్నాయి. నేతల మాటలతూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ,ప్రతిపక్ష టీడీపీ విమర్శలలో ఎవరికీ తీసిపోని విధంగా తలపడుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ప్రధానంగా విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తూ దూకుడు చూపిస్తుండగా,టిడిపి నుండి విజయసాయిరెడ్డికి రివర్స్ పంచ్ వేస్తూ బుద్ధా వెంకన్నదూసుకుపోతున్నాడు.

 లాఫింగ్ బుద్ధ హాష్ ట్యాగ్ తో పొలిటికల్ పంచ్ వేసిన బుద్ధ వెంకన్న

లాఫింగ్ బుద్ధ హాష్ ట్యాగ్ తో పొలిటికల్ పంచ్ వేసిన బుద్ధ వెంకన్న

సైరా పంచ్ అంటూ తెలుగుదేశం పార్టీ మీద వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటే.. మీకే కాదు మాకు వస్తాయంటూ లాఫింగ్ బుద్ధ హాష్ టాగ్ తో బుద్ధ వెంకన్న హల్ చల్ చేస్తున్నారు. ఇక తాజాగా బుద్ధా వెంకన్న విజయసాయిరెడ్డి జగన్ ను మామా అల్లుళ్లు అని పేర్కొంటూ వేసిన ఓ పంచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. లాఫింగ్ బుద్ధ హాష్ ట్యాగ్ తో పొలిటికల్ పంచ్ వేసిన బుద్ధ వెంకన్న దేవుడు స్క్రిప్ట్ లో అందరికీ న్యాయం అల్లుడు అంటూ అటు వైసీపీ అధినేత వైఎస్ జగన్, వైసిపి నేతలు చెప్పిన మాటనే తిప్పి అదిరిపోయే సెటైర్ వేశారు.

 ముగ్గురిని కొన్నామంటే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మూడే సీట్లా

ముగ్గురిని కొన్నామంటే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మూడే సీట్లా

బుద్ధా వెంకన్న పెట్టిన లాఫింగ్ బుద్ధ పంచ్ లో విజయసాయి రెడ్డి , జగన్మోహన్ రెడ్డి కూర్చుని మాట్లాడుకుంటున్నట్టు ఉన్న ఒక ఫోటో పెట్టారు .వారిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నట్లుగా చేసిన పోస్ట్ లో 23 మందిని చేర్చుకో బట్టి 23 సీట్లొచ్చాయి .. దేవుడు స్క్రిప్ట్ అన్నావ్ కదా అల్లుడు. ఇప్పుడు ముగ్గురిని కొన్నామంటే దేవుడు స్క్రిప్ట్ ప్రకారం వచ్చే ఎన్నికల్లో మన యుశ్రారైకాపాకి మూడు సీట్లే అని జగన్‌తో చెబుతున్నట్టుగా ఆ ట్వీట్ ఉంది. ఇందులో యుశ్రారైకాపాకి అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని అర్థం. బుద్ధా వెంకన్న వేసిన పంచ్ ఇప్పుడు టీడీపీ అభిమానులకు బూస్ట్ ఇచ్చినట్లయింది. నెట్టింట ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

గతంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలనే లాజికల్ గా వాడిన బుద్దా

గతంలో వైసీపీ నాయకుల వ్యాఖ్యలనే లాజికల్ గా వాడిన బుద్దా

గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రావడంతో,అంతకు ముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 23మంది వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకున్నారు కాబట్టి దేవుడు స్క్రిప్ట్ రాశారని, ఆ స్క్రిప్టు ప్రకారం టీడీపీకి గత ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే వచ్చాయని వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి నేతలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేలను కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది మూడు సీట్లే అన్న అర్థం వచ్చేలా బుద్ధా వెంకన్న లాఫింగ్ బుద్ధా పంచ్ వేశారు.

అమరావతిలో ఇటుక కూడా కదల్చలేరు..

అమరావతిలో ఇటుక కూడా కదల్చలేరు..

ఇదే సమయంలో రాజధాని అమరావతి విషయంలో కూడా బుద్ధా వెంకన్న పోస్ట్ చేశారు. 200 రోజులనుంచీ అమరావతికోసం అనునిత్యం పోరాడుతున్న ప్రజలకు సమాధానం చెప్పే ఉద్దేశం మీకు ఎలాగో లేదని అందరికీ అర్ధం అయ్యింది . జగన్ గారూ ! కాకపోతే ప్రజలను ప్రజా ఉద్యమాన్ని కాదని అమరావతిలో ఇటుక కూడా కదల్చలేరని మీరు తెలుసుకోవాలి. లేదంటే తిరుగుబాటు తప్పదు అంటూ పేర్కొన్నారు .మా నాయకుడు, తెదేపా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో, పోరాట వీరుడు అల్లూరి సీతారామరాజు ఆదర్శంగా అమరావతి రైతుల తరపున పోరాడతాం. ఈ అరాచక ప్రభుత్వం కుట్రలను ఎదిరించి అమరావతిని నిలబెట్టుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు.

  Pawan Kalyan Motive On Issue Based Politics Highlighted Again || Oneindia Telugu
  బీసీలపై చేస్తున్న కుట్రలు బీసీలు బుద్ధి చెప్తారు

  బీసీలపై చేస్తున్న కుట్రలు బీసీలు బుద్ధి చెప్తారు

  అమరావతి ఆంధ్రుల కల. ఆ కలని చిదిమేస్తూ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా జరుగుతున్న అమరావతి పరిరక్షణ ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా, అమరావతి రైతులకు మద్దతుగా, ఈరోజు జరుగుతున్న నిరసనకు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్న ఆయన రాజధాని అమరావతి కోసం పోరాటం సాగుతుందని పేర్కొన్నారు. .అంతేకాదు అయ్యన్నపై నిర్బయ కేసు,అచ్చెన్న పై అక్రమ కేసు... కేసులతో బీసీ నాయకత్వాన్ని అణిచివేయాలనుకుంటున్న జగన్ రెడ్డికి బీసీలు బుద్ది చెప్పడం ఖాయం అంటూ కూడా మండిపడ్డారు బుద్ధా వెంకన్న .

  English summary
  Buddha venkanna's laughing buddha punch viral . In that tweet a photo of Vijayasai Reddy and Jagan Mohan Reddy sitting and discussing about seats . vijayasai reddy saying to jagan tdp joined 23 ycp leaders so according to god's script they got 23 seats and now we bought three according to your saying we will got three seats in net elections .this is a satirical post going viral now .
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more