నన్ను కార్యకర్తలు క్షమించాలి - బుద్దా వెంకన్న సంచలనం..!!
టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ దుర్మార్గపు పాలనలో అనేక పోరాటాలు చేశామన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడినట్లు తెలిపారు. తన మీద మొత్తం 37 కేసులు పెట్టారు టీడీపీ పార్టీ కోసమే పెట్టించుకున్నానన్నారు. తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బుద్దా వెంకన్న వ్యాఖ్యలు ఇప్పుడు విజయవాడలో కలకలంగా మారాయి.
ఏమీ చేయలేకపోతున్నా
విజయవాడ టీడీపీ నేత బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పదవి లేక పోవడంతో ప్రజలకు, తనను నమ్ముకున్న వారికి ఏమీ చేయలేకపోతున్నా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఐల ట్రాన్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గిందన్నారు. ఎమ్మెల్యే ఎవరిని అడిగితే వారిని సీఐలుగా నియమించారన్నారు. తన మాట చెల్లటం లేదన్నారు. అవేదనగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానే ఇతరుల మీద ఆధారపడ్డానని చెప్పుకొచ్చారు. నమ్ముకున్న వారికి తానేమి చేస్తానని ప్రశ్నించారు.

టికెట్ ఇవ్వకపోయినా
కార్యకర్తలు తనను క్షమించాలన్నారు.2024 ఎన్నికల సందర్భంలో రక్తంతో చంద్రబాబు నాయుడు చిత్రపటం కాళ్ళు కడిగాను. నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా బాధపడలేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ వెళితే నేను వెళ్లి అడ్డుకుని నిలబడ్డా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరు అప్పుడు వచ్చారో చెప్పాలి'' అనిఅన్నారు. ఐదేళ్ల వైసీపీ దుర్మార్గపు పాలనలో అనేక పోరాటాలు చేశామన్నారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, పేర్ని నాని, విజయ్ సాయి రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాట్లాడినట్లు తెలిపారు. తన మీద మొత్తం 37 కేసులు పెట్టారు టీడీపీ పార్టీ కోసమే పెట్టించుకున్నానన్నారు.
న్యాయం జరగలేదు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు న్యాయం జరగలేదని భావిస్తున్నానని... ఈ మాట ఆవేదనతోనే చెబుతున్న తప్ప వ్యతిరేకతతో కాదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఎంతోమంది పోరాటం చేసి, ఎదురు తిరిగి టీడీపీలో టికెట్లు పొందారన్నారు. తనకు టికెట్ ఇవ్వకపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశానని చెప్పుకొచ్చారు. అయితే ఎమ్మెల్యే పదవి ఉంటేనే ఏమైనా మాట చెల్లుతుందని 2024 ఎన్నికల్లో తెలుసుకున్నానన్నారు. కార్యకర్తలకు టీటీడీ లెటర్లు కూడా ఇప్పించలేని దుస్థితిలో ఉన్నానన్నారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసైనా టీడీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు సాధిస్తానని.. ఎమ్మెల్యేగా గెలుస్తానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications