వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ ఎందుకలా? పులివెందుల ఏపీలో లేదా?: 12వేల కోట్ల నష్టమంటూ బుగ్గన ఫైర్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. అర్థం లేని కార్యక్రమాలను పెట్టి ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం కేంద్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వ డబ్బుతో టీడీపీ ప్రచారం చేసుకోవడంపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. పార్టీ సొమ్ముతో ఏమైనా చేసుకోండి కానీ, ప్రజల సొమ్మును ప్రజలకే ఉపయోగించాలన్నారు. నవనిర్మాణ దీక్షలకు డ్వాక్రా మహిళలను బెదిరించి తీసుకెళ్తున్నారని బుగ్గన ఆరోపించారు.

రాష్ట్రంలో కలెక్టర్లను, అధికారులను పని చేసుకోనివ్వడం లేదని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం అవినీతికి కేరాఫ్ అండ్రస్‌గా మారిందని బుగ్గన ఆరోపించారు. చంద్రన్న మజ్జిగ పథకంలో కూడా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అనవసర ప్రకటలతో, పనులతో ఏడాదికి రూ. 12వేల కోట్ల నష్టం తెస్తున్నారని బుగ్గన ఆరోపించారు.

buggana rajendranath reddy takes on at chandrababu naidu

పులివెందులకు కూడా నీరు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఏంటనీ, పులివెందుల ఏపీలో లేదా? అని బుగ్గన.. చంద్రబాబును నిలదీశారు. నాలుగేళ్లుగా కేంద్రానికి వంగి వంగి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. విభేదాల పేరుతో ప్రస్తుతం దూరమయ్యారని అన్నారు.

Recommended Video

ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన పొలీసులు...!

రాష్ట్రంలో స్థానిక సంస్థలు, పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారని బుగ్గన ఆరోపించారు. బాగున్న రైతులను బలి చేస్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే రాష్ట్రానికి అన్యాయం చేసినట్లేనని గత నవ నిర్మాణ దీక్షలో చెప్పిన చంద్రబాబు.. ఇటీవల కర్ణాటకలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చేతులు కలపడమేంటని బుగ్గన ప్రశ్నించారు. దీంతో ప్రజలకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ఎవరో తేలిపోయిందన్నారు.

English summary
YSRCP MLA Buggana Rajendranath Reddy on Monday takes on at Andhra Pradesh CM Chandrababu Naidu for Navanirmana Deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X