• search
  • Live TV
అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమరావతి టీడీపీకే బంగారు గుడ్డు: సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం లేదు: ఆర్దిక మంత్రి బుగ్గన..!

|

ఏపీ ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి..టీడీపీ నేతల మీద ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని.. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి..ఆదాయం అని చెబుుతున్నారంటూ విమర్శించారు. అమరావతిలో ఎక్కడా సింగపూర్ ..ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం లేదని..అక్కడి రెండు కంపెనీలతో నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. తాజాగా.. సింగపూర్ ప్రభుత్వం రాసిన లేఖలో భవిష్యత్ లో ఏపీలో పెట్టబడులు సిద్దమని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.

తాము అధికారంలోకి వచ్చే సమయానికి జాతాలే దాదాపు నలభై వేల రూపాయాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఇసుక సమస్య పరష్కారం అయిందని చెప్పారు. రివర్స్ టెండిరింగ్ ద్వారా ఆదాయం ఆదా చేస్తుంటే అది చంద్రబాబుకు రుచించటం లేదని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాలను సమీక్షించమని చెప్పామే కానీ, రద్దు చేయలేదని బుగ్గన స్పష్టం చేసారు.

చంద్రబాబు వాదన తప్పులతడక

చంద్రబాబు వాదన తప్పులతడక

గత అయిదేళ్ల కాలంలో అన్ని రకాలుగా తప్పుడు సమాచారంతో చంద్రబాబు మభ్య పెట్టే ప్రయత్నం చేసారని ఆర్దిక మంత్రి బుగ్గన ఆరోపించారు. ఆయన చెప్పిన ఏ విభాగంలోనే గ్రోత్ రేట్ లేదని అంకెలతో సహా వివరించారు. చంద్రబాబు పదవి వీడే నాటికి..తమకు కేవలం జీతాల పరంగానే 40 వేల కోట్లు అప్పగించారని చెప్పుకొచ్చారు.

గతంలో చంద్రబాబు ప్రశంసించిన సంస్థలకే తాము ఇప్పుడు పనులు అప్పగి స్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని..ఇంగ్లీషు మీడియం స్కూళ్లు పేద విద్యార్ధులకు భవిష్యత్ లో మేలు చేస్తాయన్నారు. తాము అధికారం లోకి వచ్చిన తరువాతనే ఇంగ్లీషును అనేకమందికి నేర్పామని చంద్రబాబు చెబుతున్నారంటూ ఎద్దేవా చేసిన బుగ్గన.. చంద్రబాబు ఇంగ్లీషు మాట్లాడే తీరు పైన సెటైర్లు వేసారు. చంద్రబాబు మొత్తం బడాయి కబుర్లతో కాలక్షేపం చేసారని విరుచుకుపడ్డారు.

అమరావతిలో సింగపూర్ ప్రభుత్వం లేదు

కొద్ది రోజులుగా అమరావతి నుండి సింగపూర్ ప్రభుత్వం వెనక్కి వెళ్లిపోయిందని ప్రచారం చేయటంలో నిజం లేదన్నారు. స్టార్టప్ ఏరియా కోసం సింగపూర్ లోని రెండు సంస్థలతో మాత్రమే ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని..అది సింగపూర్ గవర్నమంట్ టు ఏపీ ప్రభుత్వం మధ్య జరిగిన ఒప్పందం కాదన్నారు.

అమరాతిలో పెట్టుబడి కోసం లక్షల కోట్లు కావాలని..అది సాధ్యం కాదని తెలిసి..వారు తప్పుకుంటున్నట్లుగా ఇచ్చిన లేఖలో స్పష్టం చేసారన్నారు. భవిష్యత్ లో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి తాము ముందుంటామంటూ రాసిన లేఖను బుగ్గన బయట పెట్టారు. తాము ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్న చేస్తున్న సంక్షేమం.. పధకాలు మొత్తం భవిష్యత్ మానవ వనరుల కోసమే అంటూ వివరించారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి ఆదాయం మార్గంగా చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. పోలవరం లో ఇష్టారాజ్యంగా ధరలు మార్చి పంపింది చంద్రబాబు ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు.

ఆ బంగారు గుడ్డు వారికి మాత్రమే..

ఆ బంగారు గుడ్డు వారికి మాత్రమే..

అమరావతిలో రెండు లక్షల కోట్ల ఆస్తి ఇచ్చామంటూ చంద్రబాబు వ్యాఖ్యల పైన బుగ్గన మండిపడ్డారు. అది టీడీపీ ఆలోచనలకు మాత్రమే బంగారు గుడ్డు అంటూ ఎద్దేవా చేసారు. దశల వారీ మధ్యపాన నిషేధం లో భాగంగా.. మద్యం షాపులను తగ్గించామన్నారు. అదే సమయంలో మద్యం సరఫరా తగ్గించి..ఉన్న సరుకు పైన ధరలు పెంచామని..తద్వారా వినియోగం తగ్గినా..ఆదాయం తగ్గలేదని చెప్పుకొచ్చారు.

ఇక ఇసుక సమస్య పూర్తిగా పరిష్కారం అయిందన్నారు. చంద్రబాబు హాయంలో కావాల్సిన వారికి టెండర్లు అప్పగించారని..ఇప్పుడు రివర్స్ టెండరింగ్..జ్యూడిషియల్ రివ్యూ ద్వారా మాత్రమే టెండర్ అప్పగిస్తున్నామని బుగ్గన చెప్పుకొచ్చారు. చంద్రబాబు తరచూ నోరు జారుతున్నారని..ఆయన చెప్పిన విషయాల్లో నిజాలు లేవన్నారు. ఇక, హైదరాబాద్ ను ఆయనే డెవలప్ చేసాంటూ చెబుతున్న వ్యాఖ్యలను బుగ్గన ఎద్దేవా చేసారు. తాము చంద్రబాబు హాయంలో ఏం జరిగిందో..ఇప్పుడు ఏం చేస్తున్నామో చర్చకు సిద్దమని స్పష్టం చేసారు.

English summary
AP Finance minister Buggana says govt implementing welfare Schemes all help for increase human resources in future. startup agreement not with govt..its only with singapore companies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X