ఏపిలో టోక్యో: జపాన్ ప్రతినిధులతో బాబు(పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మారుస్తామన్నారు. ఏపి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూమినిస్తే, కొంతమంది వివాదం చేస్తున్నారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధి కోణంలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పదిలక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేస్తామని చెప్పారు.
గురువారం ఆయన జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను, పారిశ్రామిక విధానాలను వివరించారు. ఏపి రాజధాని ప్రాంతం శివార్లలో నందిగామలో ఫార్మాసూటికల్ హబ్, నూజివీడులో ఫ్యాబ్రికేషన్ హబ్, అమరావతిలో పర్యాటక హబ్, సత్తెనపల్లిని హెవీ ఇండస్ట్రీస్ హబ్, గుంటూరును అగ్రికల్చర్ ట్రేడింగ్ హబ్, తెనాలి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, గుడివాడను ఆక్వా కల్చర్ హబ్ లాజిస్టిక్ పార్కు, గన్నవరాన్ని ఆటో, ఏరోస్పేస్, ఐటి హబ్‌గా తీర్చిదిద్దనున్నట్టు ప్రకటించారు.
వంద సంస్ధలు ఇప్పటికే సంయుక్తరంగంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. ముందుచూపుతో వ్యవహరించడం వల్ల మిగులు విద్యుత్‌ను సాధించామని, దేశంలో అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఉందన్నారు. పరిశ్రమలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల రంగంలో రెండు ప్రత్యేక పెట్టుబడుల రీజియన్లు, నాలుగు మేజర్ పోర్టులు, నాలుగు విమానాశ్రయాలు, 32 సెజ్‌లు, 258 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.

చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

చంద్రబాబు
ఏపీని లాజిస్టిక్స్ హబ్‌గా మారుస్తామన్నారు. ఏపి రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా భూమినిస్తే, కొంతమంది వివాదం చేస్తున్నారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అభివృద్ధి కోణంలోనే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్టు చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో పదిలక్షల ఎకరాలతో భూ బ్యాంకును ఏర్పాటు చేస్తామని చెప్పారు.

చంద్రబాబు
గురువారం ఆయన జపాన్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను, పారిశ్రామిక విధానాలను వివరించారు. రెండు నెలల్లో తాను జపాన్‌లో పర్యటించనున్నట్టు చెప్పారు.

చంద్రబాబు
పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామన్నారు.

చంద్రబాబు
న్యూ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (నెడో), మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (మెటి) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఎక్స్‌పాండింగ్ టెక్నాలజీ కో ఆపరేషన్ ఫర్ స్మార్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్' అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
జపాన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా తమ ప్రభుత్వం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరులో జపానీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జపానీయుల కోసం ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రింగ్ రోడ్డు ఏపి రాజధానిలో 180 కి.మీ ఉంటుందని, దీని చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను నిర్మిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ కూడా రాత్రికి రాత్రి అభివృద్ధి కాలేదన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచంలో 138వ ఉత్తమ నగరంగా అవతరించేందుకు కారణం తాను గతంలో 9 సంవత్సరాలు చేసిన కృషి అని వివరించారు. తమ ప్రభుత్వం హైదరాబాద్- మచిలీపట్నం, వైజాగ్- చెన్నై కారిడార్ల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సమావేశంలో నెడో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిరోషి కునియోషి, మెటి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెన్ ససాజి, జపాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ ఎకనామిక్స్ ప్రతినిధి డాక్టర్ హిరోయుకి ఇషిడా, కిటాకిషు సిటీ డిప్యూటీ డైరెక్టర్ జునిచి సోనో, టొయోటా సిటీ ప్రతినిధి మిసాకీ కనెకో, ఎడిబి సౌత్ ఏషియా ఎనర్జీ స్పెషలిస్టు సతోషి కురిమోటో, ఫ్యూజి ఎలక్ట్రిక్, కిటాచి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications