Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేయర్ దంపతుల హత్య: నేడు చిత్తూరుకు బాబు, కొనసాగుతున్న బంద్(పిక్చర్స్)

చిత్తూరు: మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల దారుణ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. పట్టపగలు.. అంతా చూస్తుండగానే ఐదుగురు దుండగులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి చొరబడి, మేయర్ అనూరాధను, ఆమె భర్త మోహన్‌ను కాల్పులు జరిపి, కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు.

మేయర్ అనూరాధ (48) అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్త మోహన్ (53) తీవ్ర గాయాలతో వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తొమ్మిది గంటల సమయంలోమరణించారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగులు కార్యాలయం గేటు దూకి పారిపోయారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మేయర్ అనూరాధ మంగళవారం ఉదయం 10 గంటలకు తన భర్త మోహన్‌తో కలిసి కార్యాలయానికి వచ్చారు.

అప్పటికే అక్కడ ఉన్న టిడిపికి చెందిన కార్పొరేటర్లు అన్నపూర్ణ, ఆమె తమ్ముడు, మరో కార్పొరేటర్ రాణితో మాట్లాడుతూ మరోవైపు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతోను మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో 11.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పుష్పగుచ్ఛాలు తీసుకుని మేయర్ వద్దకు వచ్చారు. వారి వెనుక మరో ముగ్గురు ముఖాలు కనబడకుండా బురఖాలు ధరించి ఉన్నారు.

మేయర్‌ను అభినందించడానికి వచ్చారని అందరూ భావిస్తున్న తరుణంలో పుష్పగుచ్చాల్లో దాచి ఉంచిన పిస్టల్‌తో ఓ యువకుడు మేయర్‌పై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు. ఆ వెంటనే మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో మోహన్‌పై మరో ముగ్గురు కాల్పులు జరిపి, కత్తులతో దాడిచేశారు. అనురాధ తలలోకి, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

తీవ్రంగా గాయపడ్డ మోహన్ రక్తపుమడుగులో పడిపోయారు. ఈ సంఘటనతో నిశ్చేష్టులైన మిగిలినవారు తేరుకునేలోపే దుండగులు కార్యాలయం వెనుక భాగం నుంచి గోడదూకి ద్విచక్ర వాహనంపై పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న మేయర్ దంపతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మేయర్ అనూరాధ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మోహన్‌ను వేలూరు సిఎంసి ఆస్పత్రికి తరలించారు.

మోహన్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రెండు బుల్లెట్లు తొలగించినా ఫలితం లేకపోయింది.ఈ దుశ్చర్యకు పాల్పడింది ఐదుగురని, వారంతా 25 నుంచి 30 సంవత్సరాల్లోపు యువకులని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ వాహనంలో వచ్చి కాల్పులకు తెగబడి, ద్విచక్రవాహనాల్లో పారిపోయారు.

అయితే సంఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మరొకరు కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. ఈ దుశ్చర్యలో ఆర్టీసీ బస్ డ్రైవర్ వెంకటాచలపతి, రెడ్డెప్ప, మంజునాథ్, వెంకటేశ్ అనే వ్యక్తులు పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది.

మేయర్ దంపతుల హత్య

మేయర్ దంపతుల హత్య

మంగళవారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో జరిగిన చిత్తూరు మేయర్ దంపతుల దారుణ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది.

బాబుతో అనురాధ(ఫైల్)

బాబుతో అనురాధ(ఫైల్)

పట్టపగలు.. అంతా చూస్తుండగానే ఐదుగురు దుండగులు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోకి చొరబడి, మేయర్ అనూరాధను, ఆమె భర్త మోహన్‌ను కాల్పులు జరిపి, కత్తులతో నరికి దారుణంగా హతమార్చారు.

అనురాధ

అనురాధ

మేయర్ అనూరాధ (48) అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్త మోహన్ (53) తీవ్ర గాయాలతో వేలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాత్రి తొమ్మిది గంటల సమయంలోమరణించారు.

కటారి అనురాధ(ఫైల్)

కటారి అనురాధ(ఫైల్)

కాల్పులు జరిపిన వెంటనే దుండగులు కార్యాలయం గేటు దూకి పారిపోయారు.

ఘటనా స్థలం

ఘటనా స్థలం

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మేయర్ అనూరాధ మంగళవారం ఉదయం 10 గంటలకు తన భర్త మోహన్‌తో కలిసి కార్యాలయానికి వచ్చారు.

అనురాధ మృతదేహం

అనురాధ మృతదేహం

అప్పటికే అక్కడ ఉన్న టిడిపికి చెందిన కార్పొరేటర్లు అన్నపూర్ణ, ఆమె తమ్ముడు, మరో కార్పొరేటర్ రాణితో మాట్లాడుతూ మరోవైపు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలతోను మాట్లాడుతున్నారు.

తలలో బుల్లెట్లు

తలలో బుల్లెట్లు

ఈ క్రమంలో 11.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు పుష్పగుచ్ఛాలు తీసుకుని మేయర్ వద్దకు వచ్చారు. వారి వెనుక మరో ముగ్గురు ముఖాలు కనబడకుండా బురఖాలు ధరించి ఉన్నారు.

ఘటనా స్థలంలో ప్రజలు, పోలీసులు

ఘటనా స్థలంలో ప్రజలు, పోలీసులు

మేయర్‌ను అభినందించడానికి వచ్చారని అందరూ భావిస్తున్న తరుణంలో పుష్పగుచ్చాల్లో దాచి ఉంచిన పిస్టల్‌తో ఓ యువకుడు మేయర్‌పై పాయింట్ బ్లాంక్‌లో కాల్పులు జరిపాడు.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

ఆ వెంటనే మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. అదే సమయంలో మోహన్‌పై మరో ముగ్గురు కాల్పులు జరిపి, కత్తులతో దాడిచేశారు.

రక్తపు మరకలు

రక్తపు మరకలు

అనురాధ తలలోకి, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

కార్యాలయం

కార్యాలయం

తీవ్రంగా గాయపడ్డ మోహన్ రక్తపుమడుగులో పడిపోయారు. ఈ సంఘటనతో నిశ్చేష్టులైన మిగిలినవారు తేరుకునేలోపే దుండగులు కార్యాలయం వెనుక భాగం నుంచి గోడదూకి ద్విచక్ర వాహనంపై పారిపోయారు.

ద్విచక్ర వాహనాల దగ్ధం

ద్విచక్ర వాహనాల దగ్ధం

రక్తపు మడుగులో పడి ఉన్న మేయర్ దంపతులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

వాహనం ధ్వంసం

వాహనం ధ్వంసం

అప్పటికే మేయర్ అనూరాధ మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మోహన్‌ను వేలూరు సిఎంసి ఆస్పత్రికి తరలించారు.

అనురాధ మృతదేహం

అనురాధ మృతదేహం

మోహన్ శరీరంలో మూడు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రెండు బుల్లెట్లు తొలగించినా ఫలితం లేకపోయింది.

అనురాధ మృతదేహం

అనురాధ మృతదేహం

ఈ దుశ్చర్యకు పాల్పడింది ఐదుగురని, వారంతా 25 నుంచి 30 సంవత్సరాల్లోపు యువకులని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ వాహనంలో వచ్చి కాల్పులకు తెగబడి, ద్విచక్రవాహనాల్లో పారిపోయారు.

గుమిగూడిన జనం, పోలీసుల విచారణ

గుమిగూడిన జనం, పోలీసుల విచారణ

అయితే సంఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.

ధ్వంసం

ధ్వంసం

మరొకరు కోర్టులో లొంగిపోయినట్లు తెలిసింది. ఈ దుశ్చర్యలో ఆర్టీసీ బస్ డ్రైవర్ వెంకటాచలపతి, రెడ్డెప్ప, మంజునాథ్, వెంకటేశ్ అనే వ్యక్తులు పాలుపంచుకున్నట్టు తెలుస్తోంది.

ఆస్పత్రికి తీసుకెళ్తూ..

ఆస్పత్రికి తీసుకెళ్తూ..

దుండగులు సంఘటన స్థలంలో వదలి వెళ్లిన ముసుగులను, కాల్పులకు ఉపయోగించిన పాయింట్ 32పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కారు ధ్వంసం

కారు ధ్వంసం

కాగా, మేయర్ హత్యకు ఆమె భర్త మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారని అనుమానించిన కఠారి అనుచరులు ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. దీంతో జిల్లాలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

దుండగులు సంఘటన స్థలంలో వదలి వెళ్లిన ముసుగులను, కాల్పులకు ఉపయోగించిన పాయింట్ 32పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మేయర్ హత్యకు ఆమె భర్త మోహన్ మేనల్లుడు చింటూ అలియాస్ చంద్రశేఖర్ ప్రధాన సూత్రధారని అనుమానించిన కఠారి అనుచరులు ప్రతీకార దాడులకు పాల్పడ్డారు. దీంతో జిల్లాలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

కొనసాగుతున్న బంద్

చిత్తూరు నగర మేయర్‌ అనురాధ దంపతుల హత్యకు నిరసనగా బుధవారం చిత్తూరులో బంద్‌ కొనసాగుతోంది. మేయర్‌ దంపతుల హత్యకు నిరసనగా ఏపీ కాపునాడు అధ్యక్షుడు విపి నారాయణస్వామి బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్‌ కారణంగా చిత్తూరులోని వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసివేశారు.

నేడు చిత్తూరుకు చంద్రబాబు?

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం చిత్తూరు వెళ్లనున్నట్లు సమాచారం. చిత్తూరు నగర మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్యల నేపథ్యంలో ముఖ్యమంత్రి చిత్తూరుకు రానున్నట్లు తెలిసింది. అయితే మంగళవారం అర్ధరాత్రి వరకు కూడా ముఖ్యమంత్రి పర్యటనపై అధికారికంగా షెడ్యూల్‌ ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి తొలుత తిరుపతి చేరుకొని.. అక్కడి నుంచి చిత్తూరు వెళ్తారని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+