మద్యం మత్తులో డ్రైవర్: బస్సు బోల్తాపడి 10మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
చిత్తూరు: జిల్లాలోని చౌడేపల్లి మండలం కాట్పేరి బస్టాండు వద్ద శనివారం ఉదయం పుంగనూరుకు చెందిన ప్రైవేటు పాఠశాల బస్సు మూడడుగులు లోయలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 40మంది విద్యార్థుల్లో 10మందికి తీవ్ర గాయాలు కాగా, 30 మందికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు విద్యార్థులను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి ఉండటం, అతివేగమే ప్రమాదానికి కారమణి స్థానికులు తెలిపారు.
విద్యార్థులకు ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. ఐదుగురు విద్యార్థుల పరిస్థితి కొంత ఆందోళనకరంగా తెలిపారు. బోయకుండ పరిసర గ్రామాల నుంచి విద్యార్థులను పుంగనూరు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ఆటో నడుపుకేనే డ్రైవర్ బస్సును నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడ్నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.
ఇద్దరు విద్యుత్ ఉద్యోగులు మృతి
నెల్లూరు: జిల్లాలోని మర్రిపాడు కదిరినేనిపల్లిలో విద్యుత్ షాక్‌తో లైన్‌మెన్ వేణుతోపాటు ముగ్గురు ఉద్యోగులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణంటూ ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులపై గ్రామస్తులు దాడి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతతకు దారితీయడంతో పోలీసులు మోహరించారు.












Click it and Unblock the Notifications