సిమెంట్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు: ఇద్దరు మృతి
పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వివరాల్లోకి వెళితే... విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్తున్న శ్రీకెవిఆర్ ట్రావెల్స్ బస్సు.. సిమెంట్ లోడుతో వెళుతున్న లారీని వేగంగా ఢీకొట్టింది.
దీంతో లారీ బోల్తాపడగా, బస్సు డ్రైవర్ తోపాటు మరో ప్రయాణికుడు మృతి చెందాడు. బస్సులోని ప్రయాణికులతోపాటు లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడమే కారణమని తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, గాయాలపాలైన వారిని ఆస్పత్రులకు తరలించారు. త్వరగా గమ్యం చేరేందుకు బస్సు డ్రైవర్ అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని పలువురు ప్రయాణికులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తండ్రిని చంపిన కుమారుడికి జీవిత ఖైదు
చిత్తూరు: కన్న తండ్రిని చంపిన ఓ తనయుడికి న్యాయస్థానం గురువారం జీవిత ఖైదు విధించింది. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన రమేష్ 2013లో తండ్రి ఆస్తి పంచాలని కోరాడు. అందుకు తండ్రి శ్రీరాములు(65) నిరాకరించడంతో ఆగ్రహించిన రమేష్ తండ్రిపై దాడిచేసి తలనరికి చంపాడు. అనంతరం కుప్పం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ కేసును విచారించిన జిల్లా జడ్జి అతనికి జీవిత ఖైదు విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు.












Click it and Unblock the Notifications