ఘోర ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ, ఐదుగురు మృతి

పశ్చిమగోదావరి: జిల్లాలోని నల్లజర్ల మండలంలోని అనంతపల్లి ఎర్రకాలువ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు. ద్వారకా తిరుమల వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రాజమహేంద్రవరం నుంచి ఏలూరు వెళుతున్న కొవ్వూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును రాజమహేంద్రవరం వైపు వెళుతున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తునికి చెందిన గేలం లక్ష్మి(50), కాపుశెట్టి జ్యోతి(37), కాపుశెట్టి అఖిల సత్య(12), కాపుశెట్టి శివసాయి(14), ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ(60) మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.

bus accident in West Godavari: five killed

తునికి చెందిన కాపుశెట్టి నాగేశ్వరరావు భార్య జ్యోతి, కుమార్తె అఖిల సత్య, కుమారుడు శివసాయితో కలిసి గురువారం నిడదవోలులోని అత్తవారింటికి వచ్చారు. అక్కడ నుంచి తన అత్త గేలా లక్ష్మితో కలిసి ఎర్నగూడెం వచ్చి ద్వారకా తిరుమల వెళ్లే నిమిత్తం బస్సు ఎక్కారు. ఆ తర్వాత ఒడిశాకు చెందిన పల్లా సావిత్రమ్మ, జోగచర్లలో ఉంటున్న తనపెద్ద కుమార్తె లక్ష్మి ఇంటికి వెళ్లేందుకు రాజమహేంద్రవరంలో బస్సు ఎక్కారు.

వీరంతా 10 నిమిషాల్లో బస్సు దిగుతారనగా ప్రమాదం జరిగింది. భార్య, పిల్లలు, అత్త చనిపోవటంతో నాగేశ్వరరావు విలపించిన తీరుతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. తాడేపల్లిగూడెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+