పల్లె బాట పట్టిన నగర ప్రజానీకం: విమాన ఛార్జీలను మించిన బస్సు ఛార్జీలు

హైదరాబాద్: తెలుగు వారంతా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే ప్రైవేట్ ట్రావెల్స్‌కు పండుగే. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ రేట్లను 50 శాతానికి పైగా పెంచేసి కాసులను దండుకుంటున్నారు.

పండుగ పేరుతో ప్రయాణీకులకు అడ్డంగా దోచేస్తున్నారు. పండుగ నాడు తమ కుటుంబ సభ్యులతో గడుపుతామని పల్లె బాట పట్టిన జనాల జేబులు గుల్ల చేస్తున్నారు. విమాన ఛార్జీలకు ఏమాత్రం తీసిపోకుండా బస్సు ఛార్జీలను అమాంతం పెంచేశారు.

దీంతో ప్రయాణికులపై భారం పడుతోంది. అయితే ఆర్టీసీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్‌కు ఎంతమాత్రం తీసిపోకుండా బస్సు ఛార్జీలను అమాంతం పెంచేస్తోంది. ప్రయాణికులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అధిక ధరలకు ప్రయాణికులు టికెట్లు కొనాల్సి వస్తోంది.

Bus charges doubled due to sankranti festival

హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లాలంటే రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయనగరం కూడా అంతే వసూలు చేస్తున్నారు. ఇక రాజమండ్రికి 2వేలు, భీమవరానికి 1600, ఏలూరుకు 2వేలు వసూలు చేస్తున్నారు. బస్సు ఛార్జీలు రెట్టింపు ప్రైవేట్ ఆపరేటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయకుండా ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది.

ఛార్జీల వివరాలు:
* హైదరాబాద్-విజయనగరం బస్సు ఛార్జీ రూ. 3వేలు, నాన్ ఏసీ బస్సుకు రూ.1300
* హైదరాబాద్-వైజాగ్ వెళ్లాలంటే గరిష్టంగా రూ.3వేలు. నాన్ ఏసీ బస్సుకు రూ. 1700
* హైదరాబాద్-రాజమండ్రికి బస్సు ఛార్జీ రూ.2వేలు
* హైదరాబాద్-భీమవరానికి బస్సు ఛార్జీ రూ.1600
* హైదరాబాద్-ఏలూరుకు బస్సు ఛార్జీ రూ.2వేలు
* హైదరాబాద్-అమలాపురం బస్సు ఛార్జీ రూ.వేలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+