ఉద్యోగినిపై వ్యాపారి రేప్‌యత్నం: పార్టీ లేడీ నేతపైనే..

Businessman attempts to rape woman employes
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు సమీపంలోని నోవాటెల్ హోటల్లో సిగ్గుపడాల్సిన సంఘటన చోటు చేసుకుంది. హోటల్లోని మహిళా ఉద్యోగిపై ముంబైకి చెదిన వ్యాపారవేత్త ముఖేష్ అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. దాంతో బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

పోలీసులు కేసు నమోదు చేసుకుని ముఖేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. తనపై అత్యాచార యత్నం జరిగిందని హౌస్ కీపింగ్ ఉద్యోగిని ఫీర్యాదు చేసింది. హోటల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

ఎంఎంటిఎస్ రైల్లో ప్రయాణిస్తున్న మహిళతో రైల్వే టిటిఈ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. సిజన్ టికెట్‌తో ఎసి బోగీలో ఎక్కిన మహిళకు 12 వేల రూపాయల జరిమానా విధిస్తూ చలాన్ రాశాడు. ఇదేమిటని ప్రశ్నించిన మహిళపై అనుచితంగా మాట్లాడడమే కాకుండా ఆమెను గాయపరిచాడు. శుక్రవారంనాడు ఈ ఘటన జరిగింది. ఓ పార్టీ నాయకురాలిపైనే ఇలాంటి సంఘటన జరగడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

హైదరాబాదులోని మియాపూర్‌కు ెచందన లోకసత్తా పార్టీ గ్రేటర్ అధ్యక్షురాలు చంద్ర మధ్యాహ్నం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే రైలులోని ఒకటవ క్లాస్ బోగీలో ఎక్కారు. ఆ బోగీలో ఆమె ఒకరే కూర్చుని ఉన్నారు. చందానగర్ దాటగానే నరేష్ రాజ్ అనే టిటిఈ బోగీలోకి వచ్చి చూపించాలని అడిగి అమె పట్ల దురుసుగా వ్యవహరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+