వైసీపీలోకి బుచ్చయ్య-బాబు ఫోన్ చేసినా నో : జూ ఎన్టీఆర్ కు మద్దతే కారణం-25న రాజీనామా..!!
టీడీపీకి భారీ షాక్. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీనే నమ్ముకున్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీని వీడాలని నిర్ణయించారు. బుచ్చయ్య పార్టీ వీడే ఆలోచనలో ఉన్నారనే సమాచారం తెలుసుకున్న టీడీపీ అదినేత చంద్రబాబు ఆయనతో మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేసారు. వచ్చేవారం తాను వస్తానని అన్ని విషయాలు మాట్లాడుదామని.. అన్నీ సర్దుకుంటాయని కూడా బుచ్చయ్యకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అయినప్పటికీ బుచ్చయ్య మాత్రం 24 గంటల గ్యాప్‌లోనే తాను రాజీనామా చేసేస్తున్నట్లు తన అనుచరులకు తేల్చి చెప్పారు.

ఈ నెల 25న ముహూర్తం ఖరారు...
బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయటానికి ఈ నెల 25వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నట్లు విశ్వస నీయ సమాచారం. తనకు పార్టీలో గుర్తింపు లేకుండా పోయినా..అన్నీ భరించి పార్టీ కోసం పని చేస్తుంటే...తన కంటే జూనియర్లు తన మీద పెత్తనం చేస్తున్నారంటూ చంద్రబాబుకు పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనకు గౌరవం ఇవ్వకపోగా..తన వద్దకు వచ్చిన వారితోనూ ఇబ్బంది కరంగా వ్యవహరిస్తున్నారంటూ పార్టీలోని వైరి వర్గం పైన ఆయన నేరుగా చంద్రబాబుకు ఫిర్యాదు చేసారు.

చంద్రబాబు-లోకేష్ ఫోన్ కూడా తీయటం లేదు..
ఇక, తన సన్నిహితులతో తాను రాజీనామా నిర్ణయం తీసుకోవటానికి గల కారణాలను విశ్లేషించారు. తాను ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేసిన సమయం నుంచి క్రమశిక్షణతో ఉన్నానని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్లను హైకమాండ్ అవమానిస్తోందని బుచ్చయ్య ఆవేదనకు లోనయ్యారు. తన లాంటి సీనియర్ నేత ఫోన్‌ను కూడా తండ్రీకొడుకు (నారా చంద్రబాబు, నారా లోకేష్) అటెండ్ చేయట్లేదని ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తికి కారణంగా చెబుతున్నారు. తన తనుచరలతో బుచ్చయ్య ఆవేదన పంచుకున్న విషయం తెలిసిన వెంటనే చంద్రబాబు ఫోన్ చేసి..నచ్చచెప్పే ప్రయత్నం చేసినా..బుచ్చయ్య రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ఎన్టీఆర్ వర్గం-పట్టించుకోని చంద్రబాబు..
1995 టీడీపీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ వెంటే బుచ్యయ్య నడిచారు. అయితే.. చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీ అధికారంలోకి వచ్చాక సీనియర్ నేత అయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అధినేత తీరుపై అప్పట్లో బుచ్చయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా చౌదరి ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకుని నిలిచి మరీ బుచ్చయ్య విజయం సాధించారు. అయితే, బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత తీరుతో మనస్థాపానికి గురైన విషయం తెలుసుకున్న వైసీపీ ముఖ్య నేతలు ఆయనతో మంతనాలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

జూ ఎన్టీఆర్ ను సమర్ధించిన కారణంగానా..
కొద్ది రోజుల క్రితం చంద్రబాబు పర్యటనల్లో కుప్పంతో పాటుగా మచిలీ పట్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు-ఆయనను పార్టీలోకి తీసుకురావాలనే నినాదాలు వినిపించాయి. ఆ సమయంలో గోరంట్ల బుచయ్య చౌదరి వారి డిమాండ్ పైన సానుకూలంగా స్పందించారు. జూనియర్ సేవలు ఇప్పుడు పార్టీకి అవసరమని తేల్చి చెప్పారు. జూనియర్ రాకను ఎవరూ అడ్డుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనకు ఆ బాధ్యత ఉందంటూ బుచ్చయ్య చెప్పుకొచ్చారు. ఆ సమయంలో బుచ్చయ్య స్పందించిన తీరు పైన పార్టీలో చర్చ జరిగింది. అధినాయకత్వం దీని పైన వ్యతిరేకంగా స్పందించినట్లు ప్రచారం జరిగింది. అప్పటి నుంచే బుచ్చయ్య ఫోన్ చేసినా చంద్రబాబు- లోకేష్ నుంచి స్పందన లేదని చెబుతున్నారు.

వైసీపీలోకి ఎంట్రీ ఖాయమంటూ...
జిల్లాకు చెందిన వైసీసీ సీనియర్ నేత...క్రిష్ణా జిల్లాకు చెందిన ఒక మంత్రి ఆయనతో రాయబారం నడిపినట్లుగా తెలుస్తోంది. ఆయన్ను వైసీపీలోకి తీసుకొచ్చేందుకు వారితో జరిగిన చర్చల్లో బుచ్చయ్య అంగీకరించారని విశ్వస నీయ సమాచారం. బుచ్చయ్య ఈ నెల 25న ఎమ్మెల్యే పదవితో పాటుగా టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని సమాచారం. ఆ తరువాత అధికారికంగా వైసీపీలో చేరుతారని జిల్లాకు చెందిన వైసీపీ నేతల ద్వారా తెలుస్తోంది.

బీజేపీ నేతల ఆహ్వానం...భవిష్యత్ పై హామీ
ఇదే సమయంలో...తూర్పు గోదావరి జిల్లాకే చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం బుచ్చయ్య చౌదరితో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. గతంలో టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన ఒక రాజ్యసభ సభ్యుడు సైతం బుచ్చయ్యతో మాట్లాడి టీడీపీ వీడితే బీజేపీలో చేరాలని ఆహ్వానించారని తెలుస్తోంది. స్థానికంగా టీడీపీ నేతలతో ఇబ్బంది పడిన బుచ్చయ్య బీజేపీలోకి వెళ్లే అవకాశాలు తక్కువని..ఆయన వైసీపీ వైపే ఆసక్తిగా ఉన్నారంటూ జిల్లాలోని పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది.
Recommended Video

రాజీనామా ఖాయం-ఫ్యూచర్ ఆయనదే నిర్ణయం..
ఇక, తనకు చంద్రబాబు పదవులు ఇవ్వకపోవటం ..సీనియర్ అయినా తగిన గుర్తింపు లేకపోవటం బుచ్చయ్య ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. కానీ, బుచ్చయ్య సన్నిహితులు మాత్రం ...బుచ్చయ్య చౌదరి రాజీనామా నిర్ణయం నిజమేనని..అయితే, పార్టీ ముఖ్య నేతలు మాట్లాడుతుండటంతో ఆయన ఏమైనా నిర్ణయం మార్చుకుంటారా అనేది చూడాల్సి ఉందంటున్నారు. అదే సమయంలో పార్టీ మారితే..ఆయన వైసీపీలోనే చేరుతారని మరి కొందరు ఖరా ఖండిగా చెబుతున్నారు. దీంతో..ఈ నెల 25న బుచ్చయ్య చౌదరి తన రాజీనామా-భవిష్యత్ రాజకీయ అడుగులు పైన ఏం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications