ఆగండి, పోటీ చేస్తా: టిడిపిలో ఎందుకు చేరలేదని ప్రశ్నిస్తే బుట్టా రేణుక సమాధానం

Posted By:
Subscribe to Oneindia Telugu

కర్నూలు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు లోకసభ స్థానం నుంచి తాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఎంపీ బుట్టా రేణుక చెప్పారు.

జగన్ తేల్చలేకపోయారా: బుట్టా రేణుక కౌంటర్లు, ట్విస్ట్.. బాబుకూ ఝలక్ ఇచ్చారు

ఈ నెల 17వ తేదీన అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి ఆయనకు తాను మద్దతు తెలిపానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని తేల్చి చెప్పారు.

షాకింగ్: 'బుట్టా రేణుకకు రూ.70 కోట్ల ప్యాకేజీ', బిజెపి భయం... అందుకే టిడిపిలో చేరలేదు

నా మద్దతు టిడిపికే ఉంటుంది

నా మద్దతు టిడిపికే ఉంటుంది

అధికారికంగా టిడిపిలో చేరకపోయినా తన మద్దతు ఎప్పుడు అధికార పార్టీకే ఉంటుందని బుట్టా రేణుక అన్నారు. చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి పార్టీకి మద్దతు తెలపాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

టిడిపిలో ఎందుకు చేరలేదని ప్రశ్నిస్తే రేణుక ఇలా

టిడిపిలో ఎందుకు చేరలేదని ప్రశ్నిస్తే రేణుక ఇలా

పార్టీలో ఎందుకు చేరలేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 2019 వరకు ఆగండి అని సమాధానం చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. టిడిపిలో చేరడంపై కుటుంబ సభ్యులతో చర్చిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రగతికి చంద్రబాబు అహర్నిశలు పాటు పడుతున్నారని కొనియాడారు. ఆయనతో పాటు అందరూ కలసి కట్టుగా పని చేస్తే రాష్ట్రం మరింత అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు.

ఎన్నికలకు మరో ఏడాది ఉన్నందున

ఎన్నికలకు మరో ఏడాది ఉన్నందున

ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్నందున కర్నూలు లోకసభ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని బుట్టా రేణుక చెప్పారు. కేంద్ర నిధులు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో గ్రామీణ రహదారులు, తాగునీటి పథకాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

లోటు బడ్డెట్ ఉన్నప్పటికీ

లోటు బడ్డెట్ ఉన్నప్పటికీ


లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని రేణుక చెప్పారు. కర్నూలు జిల్లాలో తాగు, సాగునీటి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
జిల్లాలోనే వెనుకబడ్డ ఆలూరు నియోజకవర్గంలోని రైతులు కేవలం వర్షాధారంపైనే పంటలు పండించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సాగు నీటి వనరులు లేకపోవడంతో సకాలంలో వర్షాలు కురవక పంటలు పండక తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేదవతి, నగరడోణ జలాశయాలు పూర్తి అయితే నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందన్నారు. వేదవతి నదిపై జలాశయ నిర్మాణం పూర్తి కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Kurnool MP Butta Renuka said that she will contest from kurnool Lok Sabha in 2019 elections from Telugu Desam party.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి