బడ్జెట్‌పై ఆచితూచి జగన్‌పార్టీ: ఫరవాలేదని బుట్టా రేణుక

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆచితూచి స్పందించింది. ఆ పార్టీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌లో చాలా ఆశించామని అయినప్పటికీ కొంత ఫరవాలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐఐటీ, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, కారిడార్, పోర్టుల అభివృద్ధి తదితరాలు ఇచ్చారని చెప్పారు.

రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అయినందున తాము బడ్జెట్‌లో మరింత ఆశించామని చెప్పారు. అయితే, బడ్జెట్ ఫరవాలేదని, ఇంకా కొన్ని ఇస్తే మాత్రం బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఈ బడ్జెట్ రైతులకు, చేనేత కార్మికులకు మంచి ఉపశమనం అన్నారు. బడ్జెట్‌లో మహిళలకు సంబంధించి బాగుందన్నారు. మహిళా భద్రత విషయంలోను చాలా ఆశించామని, ఇచ్చినవి ఫరవాలేదన్నారు.

Butta Renuka welcomes Budget

కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో మాట్లాడుతూ.. తాము ఎన్డీయే ప్రభుత్వానికి షరతులతో కూడిన మద్దతు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ పైన ఆ పార్టీ ఎంపీ బుట్టా రేణుక సానుకూలంగా స్పందించారు.

వ్యవసాయానికి సంబంధించిన తాజా సమాచారాన్ని రైతులకు చేరవేసేందుకు కిసాన్ టీవీ ఛానల్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోకసభలో చెప్పిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో ఇందుకోసం రూ.100 కోట్లను కేటాయించారు. ఈ ఛానల్ ద్వారా సేంద్రీయ ఎరువులు ఎలా వాడాలి? వాటి వల్ల ప్రయోజనాలు తదితర అంశాలను వివరించే కార్యక్రమాలు ప్రసారమవుతాయి. అలాగే కొత్త వ్యవసాయ పద్ధతులకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను కూడా ఈ చానల్ ద్వారా ప్రసారం చేస్తారు. వ్యవసాయానికి సంబంధించిన తాజా అప్ డేట్స్‌ను అన్నదాతలకు అందించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+