ఎలక్ట్రిక్ బైక్స్ కొనాలా వద్దా? అయితే ఇది మీ కోసమే!

ద్విచక్ర వాహనం లేకుండా అడుగు బయటపెట్టే పరిస్థితి ప్రస్తుతం ఏ ఒక్కరికీ లేదు. పెరుగుతున్న జనాభా, అందులో ప్రతీ ఒక్కరికీ వెహికిల్ కంపల్సరీ. అది టూ వీలర్ అయినా, ఫర్ వీలర్ అయినా సరే.. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న కాలుష్యం, దాని పర్యవసానంగా మన జీవితంపై పడుతున్న ప్రభావం వెరసి అందరూ పర్యావరణం గురించి ఆలోచించే సమయం వచ్చింది. ఆ ప్రయత్నంలో భాగమే ఈ బైక్స్.

మార్కెట్ లో ఎలక్ట్రిక్ బైక్స్
ద్విచక్ర వాహనాలు ఇప్పటివరకు పెట్రోల్ తో నడిచేవే మనం ఉపయోగిస్తున్నాం. అయితే పర్యావరణం కోసం ప్రస్తుతం పెట్రోల్ తో అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్స్ మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి . మూడు , నాలుగు గంటలు కరెంట్ తో ఛార్జింగ్ చేసుకుంటే ఎనబై నుండి వంద కిలో మీటర్ల వరకు పరుగెత్తే వాహనాలను అనేక కంపెనీల షో రూమ్ లు మార్కెట్లోకి తీసుకు వస్తున్నాయి.

buying electric bikes good or bad Then this is for you

ఎలక్ట్రిక్ బైక్స్ తో ఈ ఉపయోగాలు
ఈ ఎలక్ట్రిక్ బైక్స్ తో వాయు కాలుష్యాన్ని ,శబ్ద కాలుష్యాన్ని అరికట్టవచ్చు. సీసీ ఎక్కువగా ఉండి విపరీతమైన శబ్దాలతో రోడ్ వెంట పరిగెడుతున్న వాహనాలతో శబ్ద కాలుష్యం వెలువడి మానవజాతి ,జంతుజాతి మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుంది. మరి అలాంటి ప్రమాదాలు ఎలక్ట్రిక్ బైక్స్ తో ఉండవు. ఇక సాధారణ బైక్ లతో పోల్చుకుంటే ఈ ఎలక్ట్రిక్ బైక్ లలో రిపేర్లు చాలా తక్కువగా వస్తాయని తయారీదారులు చెబుతున్నారు.

Take a Poll

ఎలక్ట్రిక్ బైక్స్ లో ఆ సమస్యకు చెక్
ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో ఇంజన్లో ఎలాంటి ఆయిల్ ఉండదు. మరియు సాధారణ సర్వీసింగ్ లు చేయించాల్సిన అవసరం కూడా ఉండదు అని షోరూం నిర్వాహకులు అంటున్నారు.. కరెంట్ ఛార్జింగ్ తో నడిచే బైక్ లు కాబట్టి మైనర్ రిపేర్లకు ఎలాంటి ఆస్కారం ఉండదని తెలియపరుస్తున్నారు. సాధారణ బైకులు నడిపేవారు కల్తీ పెట్రోల్ సమస్య వలనే బండి మాటిమాటికి ఆగిపోతుందని ఇబ్బంది పడుతుంటారు. అలాంటి సమస్య ఎలక్ట్రిక్ బైక్లో కనిపించదు..

ఈ బ్యాటరీలతో అద్భుతమైన పనితీరు
అద్భుతమైన పనితీరును కనబరిచే బ్యాటరీలలో లిథియం అయాన్ బ్యాటరీ అద్భుతంగా రాణిస్తుంది . ఒకసారి చార్జ్ చేస్తే ఎక్కువ దూరం ప్రయాణించడానికి నిత్యం అయాన్ బ్యాటరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ లిథియం బ్యాటరీ ఒకసారి బిగిస్తే రెండు సంవత్సరాల వరకు కూడా ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదని ఆయా షోరూంలో నిపుణులు కస్టమర్లకు తెలియజేస్తున్నారు.

పేలుడుకు ఆస్కారం లేని లిథియం బ్యాటరీ
గతంలో కొన్ని బ్యాటరీలు పేలుతున్నాయని సంఘటనలు చూసాం కానీ ఈ మధ్యకాలంలో రూపుదిద్దుకున్న బ్యాటరీలలో లిథియం బ్యాటరీ బాగా సక్సెస్ అయిందని ఎలాంటి పేలుడుకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు . బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేయడానికి ఒక యూనిట్ కరెంట్ సరిపోతుందని ఆ ఒక్క యూనిట్ కరెంట్ ఖర్చు పది రూపాయల వరకు అవుతుందని పది రూపాయలతో ఛార్జింగ్ చేసుకుంటే 100 కిలోమీటర్లు వాహనం పరిగెడుతుందని చెప్తున్నారు. దీంతో పెట్రోల్ భారం సామాన్య ప్రజలకు తగ్గుతుందని చెబుతున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+