వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మత పార్టీతో దోస్తీనా: పవన్‌ కళ్యాణ్‌పై రాఘవులు

By Pratap
|
Google Oneindia TeluguNews

 BV Raghavulu
హైదరాబాద్: బిజెపితో జత కట్టడాలనే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆలోచనను సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు బివి రాఘవులు వ్యతిరేకించారు. మతతత్వ భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో పవన్ కళ్యాణ్ ఇటీవల స్థాపించిన జనసేన పార్టీ కలవడం ఆశ్చర్యంగా ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

జనసేనకు తోడు తెలుగుదేశం, లోకసత్తా పార్టీలు కూడా బిజెపితో పొత్తుకు తహతహలాడుతుండడం తనను మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో మతతత్వ బిజెపి బలపడడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. కాంగ్రెసుతో సిపిఐ పొత్తు పెట్టుకుంటే తాము సిపిఐకి దారం కాక తప్పదని ఆయన అన్నారు. కాంగ్రెసు, బిజెపి వ్యతిరేక పార్టీలతో తాము పొత్తుకు సిద్ధమని ఆయన అన్నారు.

కెసిఆర్‌ను సిఎం చేయడానికే: ఉండవల్లి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ముఖ్యమంత్రిని చేయడానికే రాష్ట్రాన్ని కాంగ్రెసు విభజించినట్లుందని జై సమైక్యాంధ్ర పార్టీ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో ఆయన శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడారు. ప్రభాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆయన కాంగ్రెసును విమర్శించారు

దేశ విచ్ఛిన్నతకు కాంగ్రెసు పూనుకుందని ఆయన వ్యాఖ్యానించారు సిపిఎం తన ఎన్నికల ప్రణాళికలో ఆర్టికల్ 3ని ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు వచ్చే లోకసభలో ఆ అంశంపై చర్చ జరుగుతుందని ఆయన అన్నారు. కెసిఆర్ ఆధికారంలోకి వస్తే దొరల పాలనే వస్తుందని ఆయన అన్నారు.

ఓట్ల కోసం విభజన జరగలేదని, విభజనను జరగనివ్వబోమని, విభజన బిల్లు మళ్లీ పార్లమెంటుకు రావాల్సిందేనని ఆయన అన్నారు. విభజనపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన అన్నారు. సమైక్య ఉద్యమాన్ని తాకట్టు పెట్టి టిడిపి బిజెపితో పొత్తుకు యత్నిస్తోందని ఆయన విమర్శించారు.

English summary
CPM leader BV Raghavulu opposed the idea of forging alliance with BJP by Jana Sena chief Pawan Kalyan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X