ఏపీ ఎన్నికలు.. ట్రెండింగ్‌లో 'బై బై వైసీపీ'!
ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఉదయం ఆరుగంటల నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు, దాడులకు దిగుతున్నా ఓటర్లు మాత్రం వాటికి భయపడకుండా ఓటు వేయడానికే మొగ్గుచూపారు.
టాప్ లో చంద్రబాబు
సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు చేస్తున్న అరాచకాలను వీడియోలతో సహా పోస్ట్ చేస్తూ దీన్నిబట్టి అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ట్విటర్ లో 'హలో ఏపీ బై బై వైసీపీ' అనే హ్యాష్‌ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఇండియా ట్రెండ్స్‌లో '#APElections2024' టాప్‌లో ఉంది. దాని తర్వాత '#HelloAP_ByeByeYCP' నిలిచింది. మూడో స్థానంలో ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరిలో'ఓట్‌ఫర్‌గ్లాస్', రాజకీయ విభాగంలో చంద్రబాబు నాయుడు టాప్‌లో నిలిచారు. #TDPJSPBJPWinningAP, #YCPLosingBig కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఈసీ సీరియస్
గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ ఓటు వేయడానికి క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్ కేంద్రంలోకి వెళుతుండటంతో నిలదీసిన ఓటరును ఆయన చెంపదెబ్బ కొట్టారు. తిరిగి అతను వెంటనే శివకుమార్ ను కూడా చెంపదెబ్బ కొట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులంతా ఒక్కసారిగా నిలదీసిన వ్యక్తిపై దాడికి దిగి ఆయన్ను తీవ్రంగా గాయపరిచారు. అంతేకాకుండా అతనికి చికిత్స కూడా చేయించకుండా పోలీస్ స్టేషన్ లోనే నాలుగు గంటలుగా కూర్చోపెట్టారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య ఎటువంటి సంఘటనలు జరిగినా చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. తెనాలితోపాటు మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటనలను కూడా ఈసీ సీరియస్ గా తీసుకుంది. వాటిపై చర్యలకు ఉపక్రమించింది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications