కిరణ్ ఫోనెత్తడు, జగన్ దేశం తిరుగుతడు: బైరెడ్డి

Byreddy Rajasekhar Reddy
హైదరాబాద్: తిరుపతి వెంకన్న, శ్రీశైల మల్లన్న దయతో రాయలసీమ ముక్కలు కాలేదని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. కరువుసీమను చీల్చేందుకు కేంద్రం, రాయలసీమలోని కొందరు నేతలు కుట్రచేస్తే విచ్చిన్నం చేయవద్దని కిరణ్, చంద్రబాబు, జగన్‌లలో ఒక్కరైనా నోరెత్తకపోవడం దారుణమన్నారు. 'బాబు నోరెత్తడు, కిరణ్ ఫోనెత్తడు, జగన్ చిక్కిన విమానాన్ని ఎక్కి దేశం పట్టుకొని తిరుగుతున్నాడు' అని వ్యాఖ్యానించారు.

బీజేపీ నేతలు, కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ లాంటి వారికున్న జ్ఞానం వీళ్లకు లేకపోయిందన్నారు. కపటం లేని రాయలసీమ ప్రజలు ఎన్టీఆర్ అల్లుడనో(బాబు), వైఎస్ కొడుకనో(జగన్) వీళ్లకు ఓటెయ్యద్దని విజ్ఞప్తి చేశారు. చచ్చిపోయిన(సమైక్యాంధ్ర) దానికోసం బంద్‌లు చేయిస్తున్న ఈ ముగ్గురిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరిస్తే పట్టిన దెయ్యం వదులుతుందన్నారు.

రాయలసీమ నీటి సంగతి తేల్చకుండా పోలవరానికి జాతీయహోదా తీసుకుంటే సహించేది లేదని, కోల్పోయిన రాజధాని ఇవ్వకుంటే అగ్నిగుండమేనని ఆయన అన్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తుంగభద్ర నీటికి బోర్డు(ఆంధ్ర-కర్ణాటక వాటాల కోసం) ఉన్నట్లే శ్రీశైలం, నాగార్జునసాగర్ నీళ్లకు కూడా ప్రత్యేక బోర్డులు ఏర్పాటుచ ఏయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాలకు మాత్రమే బోర్డు వేసి చేతులు దులుపుకుంటే కుదరదని డ్యాములకు సైతం ఉండాల్సిందేనని డిమాండ్ చేశారు. పోలవరానికి జాతీయ హోదా తెచ్చుకొని శ్రీశైలానికి గ్రామీణ హోదా తెచ్చి సీమకు, తెలంగాణకు చిచ్చుపెడతారా? అని బైరెడ్డి ప్రశ్నించారు.

శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం తాము కోల్పోయిన రాజధానిని తిరిగి సీమలోని నాలుగు జిల్లాల్లో ఎక్కడ అనుకూలమైతే అక్కడ ఏర్పాటు చేయాలని, లేదంటే అగ్నిగుండమే నని హెచ్చరించారు. రాయలసీమలో రాజధాని ఉంటే శ్రీకాకుళం వాళ్లకు దూరమవుతుందని కొందరు ఆంధ్ర నేతలు గళం విప్పుతున్నారని, చెన్నైకి కన్యాకుమారి, ముంబైకి గడ్చిరోలి, బెంగుళూరుకు బీదర్, తిరువనంతపురానికి కాసర్‌గోడ్ దగ్గర్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+