వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయన మళ్లీ.. చంద్రబాబువైపు చూస్తున్నారే!!

సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలనేది బైరెడ్డి డిమాండ్.

|
Google Oneindia TeluguNews

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నేతగా చక్రం తిప్పారు. 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు నుంచి ఘన విజయం సాధించారు.
పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సమయంలో 2012లొ పార్టీ అధినేత చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చేశారు. 2013లో రాయలసీమ పరిరక్షణ సమితిని స్థాపించి వరుసగా ఐదు సంవత్సరాలు ప్రత్యేక రాయలసీమ కోసం బస్సు యాత్రలు, ట్రాక్టర్ యాత్రలు చేశారు.

 ప్రత్యర్థితో కలిసి పనిచేశారు

ప్రత్యర్థితో కలిసి పనిచేశారు


ఆశించిన రీతిలో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అందులో ఇమడలేకపోయారు. 2019 ఎన్నికలకు ముందు సొంత గూటికి చేరారు. అప్పటివరకు రాజకీయంగా ప్రత్యర్థులైన గౌరు వెంకటరెడ్డి కుటుంబంతో ఎన్నికల కోసం కలిసి పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బీజేపీలోను తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నట్లు సమాచారం. ఆయనే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.

 బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలంటూ..

బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలంటూ..


కొంతకాలంగా రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. జాతీయ రహదారి నెంబరు 167 సి పై సంగమేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం ఐకానిక్ వంతెనను మంజూరు చేసింది. సంగమేశ్వరం వద్ద సిద్ధేశ్వరం బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మించాలనేది బైరెడ్డి డిమాండ్. ఐకానిక్ వంతెన కేవలం సినిమాల్లో పాటలు తీసుకోవడానికి, సెల్ఫీలు తీసుకోవడానికి మాత్రమే పనికివస్తుందని బైరెడ్డి విమర్శిస్తున్నారు. ఆ వంతెనకు బదులుగా బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తే వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని బైరెడ్డి చెబుతున్నారు.

వేలమందితో చలో సిద్ధేశ్వరం

వేలమందితో చలో సిద్ధేశ్వరం


వేలమంది చలో సిద్ధేశ్వరం కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భారీగా రైతులు పాల్గొన్నారు. బీజేపీలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐకానిక్ వంతెనను వ్యతిరేకించడం అంటే ఆయనకు పార్టీ మారే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. ఇవే కాకుండా కొన్ని పార్టీ కార్యక్రమాల్లో బైరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. కడపలో బీజేపీ నిర్వహించిన రాయలసీమ సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో వేదికపైనే పార్టీ పెద్దలతో గొడవ పడ్డారు. ఆ తర్వాత నుంచి ఆయన పార్టీతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జాతీయ నాయకులు వచ్చినప్పటికీ స్పందించడంలేదు. బైరెడ్డి.. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ ఆయన అనుయాయుల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. ఫిబ్రవరిలో జిల్లావ్యాప్తంగా ఉన్న తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు. వారందరితో చర్చించి తెలుగుదేశం పార్టీలోకి తిరిగివేళ్లే ప్రయత్నం చేస్తారని వార్తలు వస్తున్నాయి.

English summary
He turned the wheel as the leader of the Telugu Desam Party when it was a united state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X