వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేసీకెందుకు బాధ: జగన్‌పై సీఆర్, పొలిమేరదాటొద్దని..

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: పదవి లేకుండా బతకలేకనే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఉండలేరని అందుకే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత సీ రామచంద్రయ్య ఆదివారం అన్నారు. విజయవాడలో ఏపీ కాంగ్రెసు నేతలు భేటీ అయ్యారు. నందిగామ ఉప ఎన్నికల పైన చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ అధ్యక్షులు రఘువీరా రెడ్డి, సీ రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడారు. జగన్ పార్టీ ఆరు నెలల్లో పోతే జేసీకి బాధ ఎందుకని ప్రశ్నించారు. ఆయన పదవి లేకుండా బతకలేరని ఎద్దేవా చేశారు. టీడీపీ కార్యకర్తలను జేసీ చంపారని తాను ఆ పార్టీలో ఉండగా పదేపదే చెప్పానని అన్నారు.

C Ramachandraiah blames JC for his comments

రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీలన్నీ నెరవేర్చాకనే తన ఊరి పొలిమేరల్లో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రజలు, కార్యకర్తలు జన్మభూమిలో గొడవ చేయవద్దన్నారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని చెప్పారు. నక్సల్స్ దాడిలో చనిపోతే తప్ప తాము పోటీ చేస్తామన్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న వారంతా నికార్సయిన కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అన్నారు.

శనగ రైతుల ఆందోళనపై స్పందించిన మంత్రి పత్తిపాటి

ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా రైతులు మంత్రి పత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం తెలిసిందే. శనగకు మద్దతు ధర ఇప్పించాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై మంత్రి పుల్లారావు స్పందించారు. ప్రకాశం జిల్లాలో గిడ్డంగుల్లో ఉన్న శనగ నిల్వల వేలం 15 రోజులపాటు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.ఈ లోగా ప్రభుత్వమే కొనుగోలు చర్యలు తీసుకుంటుందని రైతులకు హామీ ఇచ్చారు.

English summary
C Ramachandraiah blames JC Diwakar Reddy for his comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X