వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"చంద్రబాబు కన్నా బాలకృష్ణ బెట్టర్, పవన్ కల్యాణ్‌కే తెలియదు"

By Pratap
|
Google Oneindia TeluguNews

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మంత్రి సి. రామచంద్రయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు. మాయమాటలు, విదేశీ యాత్రలతో చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం, బిజెపి సంయుక్తంగా రాష్ట్రాన్ని మోసగిస్తున్నాయని ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. పోలవరంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాని అన్నారు.

 విదేశీ యాత్రలతో ఎన్ని పెట్టుబడులు

విదేశీ యాత్రలతో ఎన్ని పెట్టుబడులు

తాను నిర్వహించిన విదేశీ యాత్రలతో ఎన్ని పెట్టుబడులు వ్చాయో చిత్తశుద్ధి ఉంటేచంద్రబాబు ప్రజలకు స్పష్టం చేయాలని సి. రామచంద్రయ్య డిమాండ్ చేశారు. చంద్రబాబు ఎన్నిసార్లు దావోస్‌కు వెళ్లారు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయనే విషయం చెప్పాలని ఆయన డిమాండ్ ేశారు.

 చంద్రబాబు కన్నా బెట్టర్

చంద్రబాబు కన్నా బెట్టర్

చంద్రబాబు కన్నా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శాసనసభ్యుడు బాలకృష్ణల్లో ఒకరిని ముఖ్యమంత్రిగా చేస్తే మంచి పరిపాలన అందించగలరని సి.రామచంద్రయ్య అన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు.

Recommended Video

ముందస్తు ఎన్నికలు : పవన్ కల్యాణ్‌కు మోడీ సంకేతాలు
మోడీతో భేటీలు అందుకే...

మోడీతో భేటీలు అందుకే...

ప్రధాని నరేంద్ర మోడీత చంద్రబాబు భేీ అవుతున్నారని, అయితే వ్యక్తిగత విషయాలతో పాటు రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచుకునేందుకు మాత్రమే మోడీతో చంద్రబాబు భేటీ అవుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలూ ప్రత్యేక ప్యాకేజీలూ పోలవరం ప్రాజెక్టూ డివిజన్ బిల్లుల వంటి విషయాల్లో శ్రద్ధ చూపడం లేదని సి. రామచంద్రయ్య అన్నారు.

 పవన్ కల్యాణ్‌ ఎజెండా తెలియదు.

పవన్ కల్యాణ్‌ ఎజెండా తెలియదు.

పవన్ కల్యాణ్‌కే తన ఎజెండా ఏమిటో తెలియదని సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నప్పుడు పవన్ కల్యాణ్ ప్రమేయం ఎందుకని ఆయన అడిగారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే పవన్ కల్యాణ్కు ఎెందుకు కనిపించడం లేదని అడిగారు.

English summary
Congress leader C Ramachandraiah said that Balakrishna and Yanamala Ramakrishnudu are better than Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X