జగన్ అండ, కిరణ్ కట్టడి?: టిపై చకచకా ముందుకు

 Cabinet not on Telangana soon
హైదరాబాద్: సొంత పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నా రాష్ట్ర విభజన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్టుదలగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బిల్లును ఆమోదింపచేసేందుకు చకచకా పావులు కలపాలని పార్టీ పెద్దలకు ఆమె ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎనిమిది రోజుల్లో కేబినెట్ నోట్ తయారవుతుందని తెలుస్తోంది.

విభజన కోసం అవసరమైతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి, సమ్మె చేస్తున్న ఉద్యోగులపై సామ, దాన, బేధ, దండోపాయాలు ప్రయోగించి తెలంగాణపై ముందుకు వెళ్లాలని పావులు కదిపేందుకు సిద్ధంగా ఉన్నదట. ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పలుమార్లు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్ర సీమాంధ్ర నేతలు పట్టుబడితే అసెంబ్లీని సుప్తాచేతనవాస్థలో ఉంచి, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పించి పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల్లో కేబినెట్ నోట్ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో ఒప్పందం మేరకే అధిష్టానం చకచకా పావులు కదుపుతోందని సొంత పార్టీ నేతల్లోను అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ఇదే విమర్సలు చేస్తోంది. రాజీనామాలు ఆమోదించుకుంటామని మొదట చెప్పిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేక ప్రచారం జరగడంతో అనూహ్యంగా వెనక్కి తగ్గారు.

విభజనపై వడివడిగా అడుగులు పడుతుండటంతో జగన్‌తో అధిష్టానం రహస్య ఒప్పందం కుదుర్చుకుందని కాంగ్రెసు సీమాంధ్ర నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విభజన వ్యూహం అమలుకు జగన్ పార్టీ అందించనున్న సహకారం, ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఇవ్వబోయే మద్దతును దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ముందుకు వెళ్తోందని పలువురు భావిస్తున్నారు.

అక్టోబర్ తొలి వారంలో విభజనపై నోట్ కేబినెట్ ముందుకు వస్తుందని దిగ్విజయ్ స్పష్టం చేయడంతో రాష్ట్ర విభజనకు కౌంట్‌డౌన్ మొదలైనట్లయింది. బహుశా మరో 8 రోజుల్లోనే నోట్ ప్రక్రియ ముగియనుంది. నిన్నటివరకూ ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం జగన్ విడుదల తర్వాత మరింత వేగంగా పావులు కదపాలని నిర్ణయించుకుందని అంటున్నారు.

ఈ నెలాఖరులోపు ఆంటోనీ కమిటీ ఓ నివేదిక సమర్పిస్తుందని, కేబినెట్ నోట్ కూడా సిడబ్ల్యూసి తీర్మానం తరహాలో క్లుప్తంగా ఉంటుందని అంటున్నారు. ఈ నోట్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన వెంటనే సీమాంధ్రకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశముంది.

వీరు రాజీనామా చేయడం వల్ల అసెంబ్లీలో సీమాంధ్ర సభ్యుల మెజారిటీ తగ్గిపోతుంది. అప్పుడు తెలంగాణపై కేంద్ర కేబినెట్ పంపే నోట్‌కు అసెంబ్లీ ఆమోదం లభిస్తుందని అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తోందట. సమైక్యవాదం గట్టిగా వినిపిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని కట్టడి చేసేందుకు అధిష్టానం పావులు కదుపుతోందట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+